ఆర్జీవీ, రాజశేఖర్ కాంబో... ఆగిపోయిన ఆ హర్రర్ సినిమా రిలీజ్ కి రెడీ

వివాదాస్పద దర్శకుడుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మీడియాని ఎట్రాక్ట్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే వెంటనే ఆర్జీవీ అని చెప్పేస్తారు.శివ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ ఎంతో టాలెంటెడ్ గా అందరి ప్రశంసలు అందుకొని బాలీవుడ్ లో కూడా అద్బుతమైన సినిమాలు తెరకెక్కించాడు.

 Rgv Deyyam Movie Release On April 16-TeluguStop.com

అమితాబచ్చన్ లీడ్ రోల్ లో తీసిన సర్కార్ బాలీవుడ్ నాట సెన్సేషన్ క్రియేట్ చేసింది.అలాగే రంగీలా కూడా బాలీవుడ్ ఓ వండర్ అని చెప్పాలి.

అలాంటి అద్బుత చిత్రాలు తెరకెక్కించి టెక్నికల్ గా అందరి కంటే హై స్టాండర్డ్స్ లో ఆలోచించే వ్యక్తిగా ఆర్జీవీకి మంచి పేరు ఉంది.అయితే ఎందుకనో సడెన్ గా బాలీవుడ్ వదిలేసి టాలీవుడ్ కి వచ్చి పడ్డాడు.

 Rgv Deyyam Movie Release On April 16-ఆర్జీవీ, రాజశేఖర్ కాంబో… ఆగిపోయిన ఆ హర్రర్ సినిమా రిలీజ్ కి రెడీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వచ్చిన తర్వాత తెలుగులో ఏవైనా గొప్ప సినిమాలు చేసాడా అంటే లేవనే చెప్పాలి.వివాదాస్పద అంశాలు తీసుకొని వాటి చుట్టూ కథలు అల్లుకొని మార్కెట్ చేసుకొని ప్రేక్షకులకి అసహనం కలిగించే సినిమాలే చేస్తూ వస్తున్నాడు.

ప్రస్తుతం తెలుగులో అత్యంత చెత్త సినిమాలు తీసే దర్శకుడుగా ఆర్జీవీని చూస్తున్నారు.ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ, యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కాంబినేషన్ లో పట్టపగలు టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కింది.

అయితే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఏ కారణం వలనో సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది.అయితే ఇప్పుడు అదే సినిమాకి ఆర్జీవీ దెయ్యం అనే టైటిల్ మార్చి మళ్ళీ వర్మ రిలీజ్ కి రెడీ చేశాడు.

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేశాడు.ఏప్రిల్ 16న ఏక కాలంలో సౌత్ బాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాడు.

మొత్తానికి ఆగిపోయిన చిత్రానికి కొత్త రంగేసి ఆర్జీవీ తన బ్రాండ్ ఇమేజ్ ఉపయోగించుకొని దెయ్యానికి వచ్చిన నష్టం పూడ్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

#Swathi #April 16 #Rajasekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు