వకీల్ సాబ్ తో తనని పోల్చుకున్న ఆర్జీవీ  

Rgv Comments On Wakeel Saab First Look - Telugu Pawan Kalyan Tollywood, Rgv Comments, Telugu Cinema, Wakeel Saab First Look

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Rgv Comments On Wakeel Saab First Look

తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.ఇక ఈ ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో విశేషమైన స్పందన వచ్చింది.

పవన్ కళ్యాణ్ ఫాన్స్ విపరీతంగా ఈ లుక్ ని షేర్ చేసి ట్రెండింగ్ లో తీసుకొచ్చారు.రెండేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నా సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే అంచనాలు ఉండగా ఫస్ట్ లుక్ తో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

ఈ ఫస్ట్ లుక్ పై టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ స్పందిస్తూ పోజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.ఆ లుక్ చాలా అద్బుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు.

అయితే దీనిపై వివాదాస్పద దర్శకుడు అర్జీవీ మాత్రం కాస్తా డిఫరెంట్ గా స్పందించారు.ఎప్పుడు మెగా ఫ్యామిలీని కెలుకుతూ సోషల్ మీడియాలో హడావిడి చేసే ఆర్జీవీ ఈ సారి వకీల్ సాబ్ విషయంలో కూడా దానిని ఫాలో అయ్యాడు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి తానూ టేబుల్ మీద కాలు వేసుకొని ఉన్న ఒక ఫోటో షేర్ చేసి వకీల్ సాబ్ లాగే తనని పోల్చుతూ ఈ మీమ్ ని ఎవరో తయారు చేసారు అంటూ ట్వీట్ చేశారు.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అయితే అయితే ఇది వర్మ సరదాగా చేసాడా, లేక పవన్ ఫ్యాన్స్ ని కావాలనే రెచ్చగొట్టడానికి చేసాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Comments On Wakeel Saab First Look Related Telugu News,Photos/Pics,Images..