తెలుగు, కన్నడ సినిమాలు వైరస్‌.. బాలీవుడ్ వ్యాక్సిన్‌ కనుక్కోవాలి

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ వుండేది.చాలా వరకు హిందీ సినిమాలు కనీసం సౌత్ ఇండియా లో ఆడేవి కావు.

 Rgv Comments On Kgf 2 And Rrr Movie , Bollywood, Flim News, Kgf2, Rgv, Rrr Movie-TeluguStop.com

కొన్ని సినిమాలు మాత్రమే సౌత్ ఇండియాలో మరియు నార్త్ ఇండియాలో ప్రదర్శింపబడేవి.కానీ ఇప్పుడు సౌత్‌ సినిమాలు చాలా వరకు నార్త్ ఇండియా లో సూపర్ హిట్ టాక్తో ప్రదర్శింపబడుతూ ఉన్నాయి.

అంతే కాకుండా అక్కడ వందల కోట్ల వసూళ్ల ను దక్కించుకుంటూ బాలీవుడ్ సినిమాలను సైతం డామినేట్‌ చేసేలా ఉన్నాయి.అక్కడ ఇక్కడ కలిపి వంద కోట్ల వసూళ్ల ను దక్కించుకుంటున్న నేపథ్యం లో సౌత్ సినిమాల స్థాయి భారీగా పెరిగింది.

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే గొప్ప.సౌత్ సినిమాలు అంటే చిన్న స్థాయి అని భావించేవారు.

కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు సౌత్ సినిమాల ముందు చిన్నబోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సౌత్‌ సినిమాలు వర్సెస్ నార్త్ సినిమాలు అనే అంశంపై వరుసగా ట్వీట్లు చేస్తున్నాడు.ఆయన ట్వీట్లతో బాలీవుడ్ ప్రముఖులకు మరింతగా కోపంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది.బాలీవుడ్లో ఆయన గతంలో చాలా సినిమాలు చేశాడు.

అవి సూపర్ హిట్ అయ్యాయి.అయినా కూడా ఇప్పుడు బాలీవుడ్ సినిమాల మీద ఆయన చేసిన విమర్శలు విడ్డూరంగా ఉన్నాయంటూ సిని వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.

తాజాగా ఆయన ఆర్ ఆర్ ఆర్ మరియు కే జి ఎఫ్ 2 సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యం లో బాలీవుడ్ సినిమాలను మరో సారి విమర్శించాడు.బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి తెలుగు మరియు కన్నడ సినిమాల రూపంలో వైరస్ పట్టుకుంది.

ఆ వైరస్ వీరుగుడికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వెంటనే వ్యాక్సిన్ కనిపెట్టాలి.లేదంటే బాలీవుడ్ సినిమాలు కనుమరుగైపోయాయి.

నార్త్‌ లో కూడా సౌత్ సినిమాలు రాజ్యమేలే అవకాశం ఉంది అన్నట్లుగా ఆయన ట్వీట్ చేశాడు.ఆయన ట్వీట్ లో ఉద్దేశం బాలీవుడ్ సినిమాలను చిన్నచూపు చూడడం తో పాటు సౌత్ సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించాడు.

వర్మ కామెంట్స్ ని చాలా మంది సమర్థిస్తూ ఉంటే కొద్ది మంది మాత్రం కొట్టిపారేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube