ఆ సినిమా 'బాహుబలి 2' కంటే నాలుగు రెట్లు గొప్పది అంటూ వర్మ పిచ్చి కూతలు  

Rgv Comments On Kabeer Singh Movie-

రామ్‌ గోపాల్‌ వర్మకు ఏదైనా సినిమా నచ్చితే దాన్ని ఆకాశానికి ఎత్తడం చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం.తనకు నచ్చిన వారి గురించి పదే పదే స్పందించడం వారి గొప్పతనంను చాటి చెప్పేందుకు ప్రయత్నించడం చేస్తూ ఉంటాడు.

Rgv Comments On Kabeer Singh Movie--RGV Comments On Kabeer Singh Movie-

తాజాగా మరోసారి వర్మ ఒక సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడటం జరిగింది.అది ఎంతగా అంటే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ‘బాహుబలి 2’ సినిమాను మించిన సినిమా ఇది అని బాహుబలి సినిమా కంటే 4 రెట్ల గొప్ప సినిమా ఇది అంటూ వర్మ ప్రశంసలు కురిపించాడు.

Rgv Comments On Kabeer Singh Movie--RGV Comments On Kabeer Singh Movie-

ఇంతకు ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా.అదేనండి ‘కబీర్‌ సింగ్‌’.అర్జున్‌ రెడ్డి సినిమాను హిందీలో కబీర్‌ సింగ్‌గా రీమేక్‌ చేశారు.ఆ సినిమా అద్బుతం అంటూ వర్మ ప్రశంసలు కురిపిస్తున్నాడు.కబీర్‌ సింగ్‌ కు పెట్టిన పెట్టుబడికి వచ్చిన వసూళ్లను బట్టి చూస్తే బాహుబలి 2 సినిమా కంటే కూడా నాలుగు రెట్లు ఇది గొప్ప సినిమాగా వర్మ చెప్పుకొచ్చాడు.బాహుబలి 2 రెండేళ్ల పాటు చిత్రీకరించారు.కాని కబీర్‌ సింగ్‌ను మాత్రం కేవలం ఆరు నెలల్లోనే చిత్రీకరించారని వర్మ అన్నాడు.

ఇదే సమయంలో కబీర్‌ సింగ్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగతో ఒక హోటల్‌లో పార్టీ చేసుకుంటున్న ఫొటోను వర్మ పోస్ట్‌ చేశాడు.వర్మ సందీప్‌ రెడ్డిని పొగడటం పర్వాలేదు.కబీర్‌ సింగ్‌ బాగుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.కాని బాహుబలి సినిమాకు 4 రెట్లు మించి కబీర్‌ సింగ్‌ ఉందని పిచ్చి కూతలు కూయడం ఎందుకు అంటూ సోషల్‌ మీడియాలో వర్మపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.మరి వర్మ ఈ విమర్శలకు ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.