నెపొటిజంపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసి ఆలోచింపజేసిన వర్మ

ఈమద్య కాలంలో ఎప్పుడు చూసినా మీడియాలో ఉంటున్న దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.సాదారణంగానే వర్మ ఏం చేసినా కూడా వివాదాస్పదంగా ఉంటుంది.

 Ram Gopal Varma, Nepotism, Rgv On Sushant Suicide, Bollywood, Rgv Tweets On Nepo-TeluguStop.com

అలాంటిది వర్మ వివాదాస్పద అంశంను సినిమా కథాంశంగా తీసుకుంటే మరేమైనా ఉంటుందా.మొత్తం రచ్చ రచ్చ.

పవర్‌ స్టార్‌ సినిమా ప్రకటించినప్పటి నుండి వర్మ రచ్చ రచ్చ చేస్తూనే ఉన్నాడు.ఆయన మీడియాలో చేస్తున్న కామెంట్స్‌, ట్విట్టర్‌లో పెడుతున్న ట్వీట్స్‌ ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి సమయంలో వర్మ చేసిన నెపొటిజం కామెంట్స్‌ కాస్త ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.

హీరో సుశాంత్‌ మృతికి కారణం బాలీవుడ్‌లో ఉన్న నెపొటిజం అంటూ చాలా మంది ఆరోపిస్తున్నారు.

కాని వర్మ మాత్రం నెపొటిజంను కొట్టి పారేస్తున్నాడు.ఒక నిర్మాత లేదా దర్శకుడు ఎవరితో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆధరిస్తారు నాలుగు డబ్బులు వస్తాయనే చూస్తారు.

సుశాంత్‌ మార్కెట్‌ వ్యాల్యూ 75 కోట్లు అయినప్పుడు కరణ్‌ జోహార్‌ 100 కోట్ల హీరోతో సినిమా చేయాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది.తన స్థాయిని తగ్గించుకుని సినిమా తీయాల్సిన అవసరం ఏముందని వర్మ ప్రశ్నించాడు.

నెపొటిజం వల్లే సుశాంత్‌ మరణించాడంటే నేను ఆ విషయాన్ని సమర్ధించను అన్నాడు.

Telugu Bollywood, Jebugzh, Nepotism, Ram Gopal Varma, Rgv Sushant, Rgvtweets-

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అల్లు అర్జున్‌, రానాలను హీరోలుగా నిలబెట్టేందుకు నన్ను తొక్కేశారు అంటూ ఒక తమిళ హీరో నాతో వ్యాఖ్యలు చేశాడు.ఆ విషయాన్ని నేను నమ్మను.ఎందుకంటే వారి పిల్లలు బాగుండాలని, పెద్ద స్టార్స్‌ అవ్వాలని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు.

చిరంజీవి చరణ్‌ ను కాకుండా మరెవ్వరినో హీరోగా ఎందుకు పరిచయం చేస్తారు.అది ఆయన డ్యూటీ కాదు.కొడుకు తన అంతటి వాడు అవ్వాలని ఏ తండ్రి అయినా అనుకుంటాడు.అందుకోసం తమకు తోచిన విధంగా చేస్తారు.

అందులో నెపొటిజం అనడానికి ఏముంది అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు నిజమే కదా అన్నట్లుగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube