టీడీపీ కి సవాల్ విసిరిన ఆర్జీవీ  

Rgv Challenged Tdp Party-

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఏమో గానీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పంచ్ లకు ఆ పార్టీ సవాళ్లను ఎదుర్కొంటుంది.మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు కూడా టీడీపీ చచ్చిపోయింది అంటూ పెద్ద కామెంట్ పెట్టిన వర్మ ఇప్పుడు టీడీపీ కి సవాల్ విసిరారు.విజయవాడలో తాను మళ్లీ ప్రెస్ మీట్ పెడతానని..

Rgv Challenged Tdp Party--RGV Challenged TDP Party-

ఈ సారి ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీసిన రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా ప్రమోషన్ కోసం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాలని భావించగా, దానికి అప్పుడు అధికారం లో ఉన్న టీడీపీ పార్టీ అప్పుడు ఎన్నికల సమయం కావడం, రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దీనితో వర్మ గన్నవరం విమానాశ్రయం నుంచి మళ్లీ హైదరాబాద్ కి వెనక్కి పంపేశారు.అయితే, ఇప్పుడు ఎవరు అడ్డొస్తారో చూస్తానంటూ ఆర్జీవీ సవాల్ విసురుతున్నారు.ఈనెల 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కానుంది.ఈ సినిమా కోసం ఆయన విజయవాడ వెళ్లనున్నారు.

‘ఎక్కడయితే Ex CM నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో NTR circle దగ్గర ఎల్లుండి ఆదివారం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము.బస్తి మే సవాల్ !!!’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.