కొత్త హీరోయిన్ ని పరిచయం చేసిన ఆర్జీవీ  

RGV Introduced New Heroine Name as a Apsara, Tollywood, Telugu Cinema, South cinema, Heroines, Ram Gopal Varma - Telugu Heroines, Ram Gopal Varma, Rgv Introduced New Heroine Name As A Apsara, South Cinema, Telugu Cinema, Tollywood

ఆర్జీవీ ఫ్యాక్టరీ నుంచి ఎంతో మంది అందాల భామలు హీరోయిన్స్ పరిచయం అయ్యారు.వారిలో ఊర్మిళా కూడా ఒకరు.

 Rgv Apsara Tollywood

అమ్మాయిలలో ఎవరూ చూపించని అందాలని చూపించడంలో ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు.వారిని ఒక శృంగార వస్తువుగానే వర్మ ఎప్పుడు తెరపై ఆవిష్కరిస్తూ ఉంటాడు.

వర్మ ఏ విధంగా చేసిన కూడా అతనితో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది భామలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.ఆర్జీవీ కూడా ఆల్రెడీ ఉన్న హీరోయిన్స్ జోలికి వెళ్లకుండా కొత్త అందాలని వెతికి పట్టుకొని తెరపై ఆవిష్కరిస్తాడు.

కొత్త హీరోయిన్ ని పరిచయం చేసిన ఆర్జీవీ-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా నగ్నం సినిమాతో తెలుగమ్మాయి అయినా శ్రీరాపాకని హీరోయిన్ గా పరిచయం చేసి తెలుగమ్మాయిలు కూడా ఇంత హాట్, బోల్డ్ గా నటిస్తారా అని అందరూ చర్చించుకునేలా చేశాడు.

ఇప్పుడు మరో హీరోయిన్ ని ఆర్జీవీ తన కెమెరా కళ్ళతో తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.

ఈ కొత్త అమ్మడి పేరు అప్సర రాణి.ఇదివరకు 4 లెటర్స్, ఊల్లాలా ఊల్లాల లాంటి చిన్న సినిమాలలో నటించింది.

అందులో ఈ అమ్మడు అందాల ప్రదర్శన గట్టిగానే చేసిన కూడా లోబడ్జెట్ సినిమాలు అవడం వలన ఎవరూ పట్టించుకోలేదు.ఇప్పుడు ఈ అమ్మడు ఏకంగా ఆర్జీవీ చేతిలో పడింది.

ఆర్జీవీని ఆమె హాట్ ఫోటోషూట్ చేయించి సోషల్ మీడియాకి వదిలాడు.ఈ అమ్మాయిని తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లు ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

మరి ఈ భామ బోల్డ్ అందాలని ఆర్జీవీ ఆవిష్కరించి, మంచి స్టార్ హీరోయిన్ గా నిలబెడతాడో లేక చాలా మంది తరహాలోనే కనుమరుగు చేస్తాడో చూడాలి.

#Heroines #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Apsara Tollywood Related Telugu News,Photos/Pics,Images..