అప్సర థ్రిల్‌ : ఈసారి ఏకంగా రూ.700లు పెట్టిన వర్మ  

RGV Apsara Rani Thriller Movie Ticket Update, RGV, Digital Theaters, US, Indians, Ticket Price, Apsara Thriller Movie, - Telugu Apsara, Apsara Thriller Movie, Digital Theaters, Indians, Rgv, Rgv Thriller Movie Rate, Ticket Price, Us

రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా విభిన్నంగా విచిత్రంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.కరోనా కారణంగా అంతా సినిమాలు మానేసి ఇంట్లో కూర్చుంటే ఆయన మాత్రం వరుసగా సినిమాలు తీస్తున్నాడు.

TeluguStop.com - Rgv Apsara Rani Thriller Movie Ticket Update

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

పెద్ద ఎత్తున సినిమాలు తీస్తూ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌పై విడుదల చేస్తున్నాడు.భారీ ఎత్తున విడుదల అవుతున్న ఆయన సినిమాలతో మంచి లాభాలు వస్తున్నాయి.

TeluguStop.com - అప్సర థ్రిల్‌ : ఈసారి ఏకంగా రూ.700లు పెట్టిన వర్మ-Movie-Telugu Tollywood Photo Image

ఇటీవలే రామ్‌ గోపాల్‌ వర్మ విడుదల చేసిన సినిమాలకు వంద నుండి రెండు వందల వరకు టికెట్‌ రేటు పెట్టాడు.కాని ఇప్పుడు థ్రిల్లర్‌ సినిమాకు ఏకంగా ఏడు వందల రూపాయల టికెట్‌ రేటు పెట్టాడు.

ఇండియన్స్‌ అప్సర రాణి థ్రిల్లర్‌ మూవీ చూడాలంటే రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉండగా యూఎస్‌ వారు సినిమాను చూడాలంటే మాత్రం ఏకంగా పది డాలర్లు అంటే దాదాపుగా ఏడు వందల రూపాయలను చెల్లించాల్సిందిగా రేటు నిర్ణయించారు.రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది.

కనుక కనీసం అయిదు వేల మంది అయినా అక్కడ చూసే అవకాశం ఉందంటున్నారు.అలా చూసినా కూడా వర్మకు భారీ మొత్తంలో ఆదాయం రావడం ఖాయంగా చెబుతున్నారు.

వర్మ ఈమద్య తీస్తున్న సినిమాలు అన్ని కూడా గంటలోపే ఉంటున్నాయి.అయినా కూడా వాటిని చూసేందుకు ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.అప్సర థ్రిల్లర్‌ చిత్రం ట్రైలర్‌ ఏ స్థాయిలో ట్రెండ్‌ అయ్యిందో తెల్సిందే.అప్సర లోని అన్ని యాంగిల్స్‌ను వర్మ చూపించిన తీరు అబ్బా అన్నట్లుగా ఉంది.అందుకే ఖచ్చితంగా ఈ సినిమాను జనాలు చూస్తారు అనేది ఆయన నమ్మకం.ఈనెల 14వ తారీకున ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు శ్రేయాస్‌ ఈటీ ద్వారా తీసుకు రాబోతున్నాడు.

ఈ సినిమాతో ఆయన కోటి వరకు సంపాదిస్తాడని అంటున్నారు.కేవలం ఏడు నుండి పది లక్షల రూపాయలు ఈ సినిమాకు వర్మ ఖర్చు చేసి ఉంటాడని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

#RgvTHRILLER #Indians #Apsara #Ticket Price #ApsaraThriller

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rgv Apsara Rani Thriller Movie Ticket Update Related Telugu News,Photos/Pics,Images..