వర్మ.. సంసారాలు సాగనివ్వవా?

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వారంకు ఒకటి లేదా రెండు కొత్త సినిమాలను ప్రకటిస్తూనే ఉన్నాడు.ఇప్పటికే ఈయన ఖాతాలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.

 Rgv Another Movie Mogali Puvvu On The Wedding System-TeluguStop.com

వాటిలో కొన్ని చిత్రీకరణ పూర్తి అయ్యి రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి, మరి కొన్ని చిత్రీకరణ జరుగుతున్నాయి, మరి కొన్ని స్క్రిప్ట్‌ దశలో ఉన్నాయి, మరికొన్ని ఇంకా ప్రారంభం కానివి ఉన్నాయి.మొత్తానికి వర్మ ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

ఇన్ని సినిమాలు చేతిలో ఉండగా ‘మొగలి పువ్వు’ అనే మరో సినిమాను ప్రారంభించాడు.ఈ సినిమా భార్య, భర్తల మధ్య ఉండే అపోహలు, అపార్థాల నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నాడు.

ఈయన గతంలో పెళ్లి కాన్సెప్ట్‌తో ఒక సినిమా చేస్తాను అంటూ ప్రకటించాడు.తాజాగా ‘365’ డేస్‌ అనే సినిమాను తెరకెక్కించాడు.

ఆ సినిమాలో కూడా ప్రేమ, పెళ్లి ఆ తర్వాత పరిస్థితులను చూపించడం జరిగింది.ప్రతి కుటుంబంలో ఉండే లోటు పాట్లను కూడా వర్మ తన సినిమాలతో బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

వర్మ చెప్పే ప్రతి అంశం కూడా ప్రతి సంసారంలో జరుగుతున్న విషయాలకు చాలా దగ్గరగా ఉంటున్నాయి.వర్మ సినిమాలతో లేని పోని అపోహలు మరి కొందరిలో కలుగుతున్నాయి.

దాంతో సంసారాలు చేసుకోనివ్వవా వర్మ అంటూ కొందరు మనస్సులో అనుకుంటున్నారు.వర్మ నుండి ఇంకెన్ని సంసారంకు సంబంధించిన సినిమాలు వస్తాయో అని సామన్య ప్రేక్షకులు భయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube