గాడ్సే సినిమాకి టైటిల్ కూడా పెట్టేసిన ఆర్జీవీ  

Rgv Announced The Man Who Killed Gandhi - Telugu Bollywood, Gandhi, Ram Gopal Varma,, South Cinema, Tollywood

వివాదాస్పద కథాంశాలతో సినిమాలు తీయడం అంటే టాలీవుడ్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి భలే సరదా.ఈ సరదాతోనే బాలీవుడ్ లో మాఫియా నేపధ్యంలో కథలు తీసి, టాలీవుడ్ లో రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు తీసాడు.

 Rgv Announced The Man Who Killed Gandhi

ఆర్జీవీ సినిమాలకి హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది.అదే పబ్లిసిటీతో సినిమాని అమ్మేసుకుంటాడు.

అలాగే పబ్లిసిటీకి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్న కథలని పట్టుకొని సినిమాలు చేయడంలో ఆర్జీవీ ముందు వరుసలో ఉంటాడు.ఇప్పుడు అడల్ట్ స్టార్ మియా మాల్కొవాతో క్లైమాక్స్ అనే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఇప్పటికే అందరికిలో ఒక ఇంటెన్సన్ క్రియేట్ చేశాడు.

గాడ్సే సినిమాకి టైటిల్ కూడా పెట్టేసిన ఆర్జీవీ-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే నాగబాబు దయవల్ల ఇప్పుడు మరో వివాదాస్పద అంశం దొరికింది.ఇండియాలో ఇప్పటి వరకు ఎవరికీ అంతు చిక్కని మిస్టరీగా ఉన్న అతి పెద్ద ప్రశ్న గాంధీని గాడ్సే ఎందుకు చంపాడు అని.దీనికి ఎవరికీ నచ్చిన యాంగిల్ లో వారు థియరీలు చెప్పుకుంటున్నారు.అయితే గాడ్సే కూడా గతంలో గాంధీ అనుచరుడే.

ఫ్రీడం ఫైట్ లో పాల్గోన్నవాడే కాని స్వాతంత్య్రం తర్వాత గాంధీని చంపడానికి గల బలమైన కారణాలు ఏంటి అనే విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా చేశారు.ఇప్పుడు ఇదే అంశాలు ఆర్జీవీకి కూడా చాలా క్యూరియాసిటీ పెంచేశాయి.

అందుకే గాడ్సే కథ మీద సినిమా తీస్తానని ప్రకటించడంతో పాటు తాజాగా టైటిల్ కూడా పెట్టేసాడు.ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ అనే టైటిల్ తో ఈ సినిమా తీయబోతున్నట్లు స్పష్టం చేశాడు.

ఈ కథ పూర్తిగా గాడ్సే కోణం నుంచి ఉంటుందని తెలియజేశాడు.మరి ఈ సినిమా దేశంలో ఎన్ని వివాదాలకి కారణం అవుతుందో అనేది వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు