యూఎస్ ప్రీమియర్ కి సిద్ధం అవుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్!  

యూస్, కెనడాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ చేసిన ఆర్జీవి. .

Rgv Announce Lakshmi\'s Ntr Us Premier Date-chandrababu,lakshmi Parvathi,lakshmi\\'s Ntr,nandamuri,ntr,rgv,tdp,tollywood,us Premier,ysrcp

ఏపీ రాజకీయాలతో పాటు, సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనంగా మారిన చిత్ర లక్ష్మీస్ ఎన్టీఆర్. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్టీఆర్ జీవితంలో వివాదాస్పద సబ్జెక్ట్ ని కంటెంట్ ని తీసుకొని తెరపై ఆవిష్కరించాడు. లక్ష్మి పార్వతి ద్రుష్టి కోణంలో చెప్పబడిన ఈ సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆర్జీవి విలన్ గా ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు...

యూఎస్ ప్రీమియర్ కి సిద్ధం అవుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్!-RGV Announce Lakshmi's NTR US Premier Date

ఇదిలా ఉంటే ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి వర్మ రెడీ అయిపోయాడు. అయితే టీడీపీ పార్టీ మాత్రం సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవడానికి ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఎలా అయిన అనుకున్న టైంలో రిలీజ్ చేసి తీరుతా అని పట్టుపట్టిన ఆర్జీవి తాజాగా యూఎస్, కెనడాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్ మార్చి 21 ఉండబోతుంది అని ప్రకటించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫుల్ ఎలక్షన్ మూడ్ లో ఉన్న టైంలో ఎలక్షన్స్ ని ప్రభావితం చేసే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంత వరకు ప్రజల మెప్పు పొందుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.