‘మర్డర్‌’ పై అసలు అమృత స్పందించనే లేదట, వర్మ పబ్లిసిటీ స్టంట్‌

రామ్‌ గోపాల్‌ వర్మ నిన్న విడుదల చేసిన ‘మర్డర్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా వర్మ ఆసినిమాను తీస్తున్నాడు అనే విషయం అందరికి తెల్సిందే.

 Rgv Create The Publicity Stunt Using Amrutha Name, Murder, Rgv, Amrutha And Pran-TeluguStop.com

ఒక తండ్రి తన కూతురు కోసం చేసిన సాహసం గొప్పది అంటూ చెప్పే ఉద్దేశ్యంతో వర్మ ఫాదర్స్‌ డే సందర్బంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది.వర్మ ఫస్ట్‌లుక్‌పై అమృత తీవ్రంగా స్పందించిందని, ఆ పోస్టర్‌ చూసిన వెంటనే చనిపోవాలనిపించింది అంటూ వ్యాఖ్యలు చేసింది అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే నా జీవితం తలకిందులు అయ్యింది.కొడుకుతో కొంత అయినా ప్రశాంతంగా గడుపుతున్నాను.

ఇలాంటి సమయంలో నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు అంటూ అమృత ఎమోషనల్‌ అయ్యింది అంటూ పెద్ద ఎత్తున ఒక కథనం వైరల్‌ అయ్యింది.దానికి వర్మ కూడా స్పందించాడు.

తాను ఎవరిని బాధ పెట్టాలని కాదు.సంఘటనల ఆధారంగా సినిమా తీస్తున్నాను తప్ప ఎవరిది తప్పు అనే విషయాన్ని మాత్రం నేను చెప్పదల్చుకోలేదు అంటూ వివరణ ఇచ్చాడు.

Telugu Amrutha Pranay, Amrutha Rao, Rgv Publicity, Tollywood-Movie

ఇంతా చూస్తే అసు అమృత ఇప్పటి వరకు మర్డర్‌ చిత్రంపై కనీసం స్పందించలేదు.అసు వర్మ మర్డర్‌ సినిమా గురించి అమృత ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో కాని టీవీల్లో కాని స్పందించలేదట.ఈ విషయాన్ని అమృత మామ అయిన బాలస్వామి పేర్కొన్నారు.ఈ విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్నది అంతా ప్రచారం మాత్రమే అన్నాడు.ఇదంతా చూస్తుంటే వర్మనే ఈ ప్రచారం అమృత పేరుతో చేసి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.వర్మ పబ్లిసిటీ కోసం ఏం చేసేందుకు అయినా సిద్దపడతాడనే విషయం తెల్సిందే.అందుకే వర్మను అనుమానించాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube