వర్మ గారి 'మర్డర్' కు బ్రేక్ లు...ఏం జరుగుతుందో!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘మర్డర్’ సినిమా కు బ్రేక్ లు పడినట్లు తెలుస్తుంది.ఒకప్పుడు వర్మ సినిమాలు అంటే యాక్షన్,థ్రిల్లర్,సస్పెన్స్ అనేవి ఉండేవి.

 Nalgonda Court Halted Ramgopal Varma Movie Murder, Rgv, Amrutha, Pranay, Murder,-TeluguStop.com

కానీ ఇప్పుడు తన దర్సకత్వ స్టైల్ నే మార్చేశాడు ఆర్జీవీ.ఎప్పుడూ కూడా యదార్ధ సంఘటనలను తెరకెక్కిస్తూ వివాదాస్పద మవుతున్నాడు.

ఇప్పటికే వంగవీటి,రక్త చరిత్ర వంటి చిత్రాలతో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వర్మ ఈ లాక్ డౌన్ సమయంలో కూడా అదే జోరు ను కొనసాగిస్తున్నాడు.థియేటర్లు మూతపడి ఉన్నప్పటికీ ఆర్జీవీ వరల్డ్ అనే వెబ్ సైట్ ను లాంచ్ చేసి అందులో తన సినిమాలను విడుదల చేస్తూ పర్ వ్యూ లెక్కన డబ్బులు వసూల్ చేస్తూ కొత్త తరహా బిజినెస్ చేస్తున్నాడు.

ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నేకేడ్’, ‘పవర్ స్టార్’ వంటి సినిమాలను వరుసగా విడుదల చేస్తూ క్యాష్ చేసుకుంటున్న వర్మ మర్డర్ మూవీ ని తెరకెక్కిస్తూ వార్తల్లో నిలిచాడు.ఇంతకీ ఈ మర్డర్ మూవీ ఎవరిదీ అన్న విషయం అందరికి తెలిసిందే.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అమృత, ప్రణయ్ ల జీవితంలో చోటుచేసుకున్న దారుణ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.మిర్యాల గూడ లో ప్రణయ్ హత్య ఘటన ఎంతగా దుమారం రేపిందో అందరికి తెలిసిందే.

ఈ యదార్ధ ఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా నిర్మించడాన్ని నిరసిస్తూ అమృత ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించింది.అయితే దీనిపై విచారణ జరిపి కోర్టు కేసు.

విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం తో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

ఏది ఏమైనా తన పంతాన్ని నెగ్గించుకొనే వర్మ ఈ మర్డర్ చిత్రం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఆసక్తికరంగా మారింది.

ఎవరి మాట కూడా లెక్కచేయని ఆర్జీవీ ఈ మర్డర్ చిత్ర విడుదలను నిలిపివేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవిస్తారా లేదంటే పై కోర్టు లను ఆశ్రయించి అనుకున్న టైం కు విడుదల చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube