శ్రీరెడ్డి చీరవిప్పి రోడ్డెక్కినపుడే ‘మా’ ఉందని తెలిసింది.. వర్మ కామెంట్స్ వైరల్!

రామ్ గోపాల్ వర్మ ఎవరి గురించి కామెంట్లు చేసినా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి.

 Rgv About Srireddy Casting Couch Episode And Movie Artist Association Elections-TeluguStop.com

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పదవికి ఎన్నిక కాగా అతని ప్యానల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేశారు.

ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ గురించి సైతం సంచలన ఆరోపణలు చేశారనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి వర్మ మాట్లాడుతూ అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు బిల్డింగ్ ఎందుకని ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.నటి శ్రీరెడ్డి చీర విప్పి రోడ్డు ఎక్కేవరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తనకు తెలియదంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన తీరును చూస్తే తనకు అసహ్యంగా, కామెడీగా అనిపించిందని వర్మ కామెంట్లు చేశారు.

Telugu Maa, Manchu Manoj, Artist, Prakash Raj, Master, Sri Reddy, Varma-Movie

ప్రకాష్ రాజ్ ను నాన్ లోకల్ అని వందల సంఖ్యలో సినిమాలు చేసిన తర్వాత అనడం కరెక్ట్ కాదని వర్మ పేర్కొన్నారు.కేవలం పదవి కోసమే లోకల్ నాబ్ లోకల్ లెగసీని తీసుకొచ్చారని వర్మ చెప్పుకొచ్చారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులను జోకర్లు అని కామెంట్లు చేయడంతో మంచు మనోజ్ వర్మను రింగ్ మాస్టర్ అని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

Telugu Maa, Manchu Manoj, Artist, Prakash Raj, Master, Sri Reddy, Varma-Movie

సర్కస్ ను కంట్రోల్ చేసే వ్యక్తిని రింగ్ మాస్టర్ అని అంటారని అయితే మనోజ్ తనను రింగ్ మాస్టర్ అని ఎందుకు పోల్చాడో అర్థం కావడం లేదని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.వర్మ చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube