పాల్‌ కాళ్లు పట్టుకున్నట్లుగా ఒప్పుకున్న వర్మ.. కాని అంటూ మళ్లీ ట్విస్ట్‌ ఇచ్చాడు

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు కాస్త ఆటిట్యూడ్‌ ఎక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తనకంటే ఎంద పెద్ద వారైనా, ప్రముఖులైనా కూడా వారి ముందు తల వంచక పోవడంతో పాటు, కనీసం వారికి గౌరవం ఇవ్వడు.

 Rgv About K A Paul About He Touched K A Paul Feet-TeluguStop.com

సీఎం ముందైనా పీఎం ముందైనా కాలు మీద కాలు వేసుకుని కూర్చునే రకం వర్మ.అలాంటి వర్మ దండం పెట్టడం మాత్రమే కాకుండా, తన కాళ్లకు నమస్కారం చేశాడంటూ కేఏ పాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వర్మ కాళ్లు పట్టుకోవడం ఏంటీ, అది కేఏ పాల్‌ పట్టుకోవడం ఏంటని అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.

వర్మ గురించి పూర్తిగా తెలిసిన వారు కేఏ పాల్‌ చెప్పేవన్ని అబద్దాలు అనుకున్నారు.కాని వర్మ మాత్రం తాను పాల్‌ కాళ్లు పట్టుకున్న మాట వాస్తవమే అంటూ చెప్పుకొచ్చాడు.అయితే కాళ్లు పట్టుకున్న కాన్సెప్ట్‌ను మాత్రం తిప్పి తిప్పి ఏదో ఏదో చెప్పాడు.

పాల్‌ కాళ్లు పట్టుకున్న విషయంను ఒప్పుకున్న వర్మ, ఆయన కాళ్లు పట్టుకుని లాగి కింద పడేయాలని పట్టుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.కాలు పట్టి కిందకు లాగితే ఆయన తల ఏమైనా సెట్‌ అవుతుందేమో అని అనుకున్నాను.

కాని ఆయనకు ఇష్టమైన మిత్రుడు ఏసుప్రభువును వెంటేసుకు వచ్చి నన్ను ఏమైనా చేస్తాడేమో అని ఆ పని చేయలేదు అన్నాడు.

గతంలో అమితాబచ్చన్‌ చనిపోతాడని అంతా అనుకున్న సమయంలో నేను వెళ్లి ఆయన్ను రక్షించాను అంటూ పాల్‌ నాతో చెప్పాడు.ఆ మాట నాకు షాకింగ్‌గా అనిపించింది.అప్పుడే అమితాబ్‌ గారిని అడిగితే అసలు నాకు పాల్‌ అనే పేరుతో ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు అన్నాడు.

అమితాబచ్చన్‌ను ప్రాణాలతో కాపాడాను అంటూ చెప్పిన కేఏ పాల్‌ను కాళ్లు పట్టుకుని లాగకుండా ఎలా ఉంటాను అంటూ వర్మ తనదైన శైలిలో ఈ విషయానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.కాని పాల్‌ కాళ్లు పట్టుకున్న విషయం నిజమే అంటూ వర్మ చెప్పడంతో అభిమానులు మాత్రం అవాక్కవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube