పంద్రాగస్టుకు ఉగ్ర భయం

ముంబై పేలుళ్ళ ఉగ్రవాది యాకుబ్ మెమన్ను ఉరి తీసిన తరువాత జరుపుకోబోతున్న ఆగస్టు 15 ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రతి ఏడాది ఆగస్టు 15కు భద్రతా ఏర్పాట్లు చేయడం సాదారణమే అయినప్పటకీ ఈసారి ఉగ్రవాద భయం ఎక్కువగా ఉంది.

 Rgi Airport Blocks Entry For Visitors-TeluguStop.com

అందుకు కారణం యాకుబ్ ఉరి.యాకుబ్ను ఉరి తీయకముందు, తీసాక కూడా సరిహద్దుల్లో ఉగ్రవాదులు దాడులు చేసారు.మొన్న ఈ మధ్య జరిగిన దాడుల్లో ఒక యువ ఉగ్రవాదిని పట్టుకున్న సంగతి తెలుసు.యాకుబ్ మెమన్ సోదరుడు టైగర్ మెమన్ భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసాడని వార్తలు వచ్చాయి.

ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.ఇందులో భాగంగా హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలో సోమవారం నుంచి సందర్శకులను నిషేధించారు.ఆ టిక్కెట్ల అమ్మకాలు నిలిపేశారు.నిషేధం ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది.

దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇదే నిషేధం అమలు చేస్తారు.ప్రయాణికులు కూడా చాలా ముందుగానే రావాలని అధికారులు కోరారు.

ఇక రైల్వే స్టేషన్లు, బస్టాండులలో భద్రతా దళాలు మోహరిస్తున్నాయి.దేశ రాజధాని దిల్లి సంగతి చెప్పనక్కరలేదు కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube