మహేష్ బాబుకి బర్త్ డే విషెస్ చెప్పిన హర్యానా ఎమ్మెల్యే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు చేసేది కేవలం తెలుగులోనే అయిన ఆయన ఇమేజ్ నేషనల్ వైడ్ అనేది చాలా మంది చెప్పే మాట.ఆయనకి ఉత్తరాదిలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Rewari Congress Mla Chiranjeev Rao Wishes Mahesh Babu, Tollywood, Haryana, Super-TeluguStop.com

ఎక్కువగా అమ్మాయిల కలల రాకుమారుడుగా మహేష్ బాబుని ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలు మనసులో పెట్టుకుంటారు.అతని సినిమాలు డబ్బింగ్ రూపంలో హిందీ ఆడియన్స్ కి రీచ్ అవుతూ ఉంటాయి.

ఇక హిందీలో కూడా మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది ఉత్తరాది ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం దక్షిణాదిలో మహేష్ బాబుతో రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు మహేష్ బాబు బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేశారు.దేశంలోనే అత్యధిక వ్యూస్ తో నెంబర్ వన్ హ్యాష్ ట్యాగ్ గా ట్విట్టర్ ని షేక్ చేస్తుంది.

ఇదిలా ఉంటే  హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ శాసనసభ్యుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి విషెస్ తెలిపారు.  హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరంజీవ్ రావ్ ట్విట్టర్లో స్పందించారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హ్యాపీ బర్త్ డే.కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు, ముఖ్యంగా దక్షిణాది ప్రజలకు ఆరాధ్య హీరో అంటూ పేర్కొన్నారు.మహేశ్ బాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు.  ఎక్కడో మారుమూల హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేష్ బాబు గురించి ట్వీట్ చేసారంటే తమ అభిమాన హీరో ఏ రేంజ్ లో ఉందో చూడండి అంటూ మహేష్ అభిమానులు అతని ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube