దుబాయ్ లో భారతీయ బాలుడికి..అరుదైన గౌరవం       2018-07-05   02:19:21  IST  Bhanu C

చిన్నతనం నుంచీ పిల్లలకి సమాజం మీద అవగాహనా..ప్రక్రుతి పట్ల ప్రేమ..ఇలాంటి ఎన్నో సున్ని తమైన విషయాలపై అవగాహన కల్పించాలి…అది ఎంతో అవసరం కూడా అంతేకాదు పర్యావరణం పై ఎంత అవగాహన ఉంటే అంట మంచిది కూడా భావి తరాలకి ఈ రకమైన అవగాహన తప్పని సరి ఎందుకంటే అభివృద్ధి ఎంతగా పెరుగుతోందో మనావుడు భూమిపై నివసించే బ్రతికే సమయం కూడా అంతకు తగ్గట్టుగా తగ్గిపోతోంది మనిషి స్వచ్చమైన గాలి పీల్చినప్పుడు మాత్రమే…ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలడు అయితే

ఇదే విధంగా దుబాయ్ లో భారత సంతతి బాలుడు పర్యావరణంపై ప్రజలలో అవగాహన అక్కడి కిరాణా దుకాణాలలో అవగాహన పెంచుతూ అక్కడి మునిసిపాలిటీ లో విస్తృత అవగాహన కలిపిస్తున్నాడు..దాంతో ఈ సేవలని గుర్తించిన దుబాయ్ ప్రభుత్వం ఆ బాలుడిని మునిసిపాలిటీ స్థిరత్వ రాయబారిగా నియమించి గౌరవింప బడ్డాడు..వివరాలలోకి వెళ్తే..

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగాన్ని మానాలని అవగాహన కల్పిస్తూ “ఫైజ్‌ మహమ్మద్‌” అనే పదేళ్ళ బాలుడు పునర్వినియోగానికి వీలైన పర్యావరణహిత బ్యాగులను స్థానిక కిరాణ దుకాణాల్లో పంపిణీ చేశాడు. ఇందుకోసం ఈద్‌ సమయంలో తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును తన అవసరాలకు ఖర్చుపెట్టకుండా 130 బ్యాగులను కొని కిరాణ దుకాణాల్లో అందజేశాడు…అయితే అతడి కృషిని గుర్తించిన దుబాయ్ మునిసిపాలిటీ.. అతన్ని స్థిరత్వ రాయబారిగా నియమించింది..