బీజేపీని ఒంటరి చేయాలన్నది రేవంత్ వ్యూహమా...

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.ప్రతిపక్షాలు ఇక ప్రజా సమస్యలపై పోరాడటానికి సిద్దమైనట్టు తెలుస్తోంది.

 Rewanths Strategy Is To Isolate The Bjp-TeluguStop.com

గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా పోరాటాల ద్వారా ప్రజల్లో ఎండగడుతూ రకరకాల నిరసనలు చేపడుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇక్కడ ఇప్పుడు ప్రతిపక్షాల ముందున్న టార్గెట్ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.

అయితే తాజాగా రేవంత్ రెడ్డి ఇందిరా పార్క్ వద్ద బీజేపీ యేతర పార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

 Rewanths Strategy Is To Isolate The Bjp-బీజేపీని ఒంటరి చేయాలన్నది రేవంత్ వ్యూహమా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ భయపడుతోందని, త్వరలో అధికారంలోకి రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని తెలిసి కాంగ్రెస్ వెన్నులో, రేవంత్ వెన్నులో వణుకు పుడుతున్నదని బీజేపీ ఆరోపిస్తోంది.అయితే ప్రతిపక్షాలను ఏకం చేసి రేవంత్ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ వర్గాలలో రకరకాలుగా వార్తలు ప్రచారమవుతున్నాయి.

రెండో ప్రత్యామ్నాయ పార్టీగా ఉండేందుకు ప్రతిపక్షాలను ఏకం చేసి మిగతా పార్టీలను లీడ్ చేసి ఒక ప్రతిపక్ష కూటమిని ఇప్పటి నుండే పరోక్షంగా నిర్మిస్తున్నట్టు మనం అర్ధం చేసుకోవచ్చు.అంతేకాక అన్ని రకాల కుల సంఘాలకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ పలు సంఘాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ త్వరలో ఈ బీజేపీ యేతర పార్టీలతో కలిసి క్షేత్ర స్థాయిలో నిరసనలకు దిగే అవకాశం కనిపిస్తోంది.

అయితే అందుకే బీజేపీని ఒంటరి చేసి ఇతర పార్టీలను తమ వెంట ఉండేలా చూసుకొని కాంగ్రెస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారడానికి కార్యాచరణ రూపొందించుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

#@BJP4Telangana #Poltics #Etala #Bandi Sanjy #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు