సొంత పార్టీలో లుకలుకలపై రేవంత్ మౌనం...అధిష్టానం భరోసానే కారణమా

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ ఎంతో కొంత తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ఏదో ఒక విషయంగా కాంగ్రెస్ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

 Rewanth's Silence On The Upheavals In His Own Party  Is It Because Of The Assura-TeluguStop.com

అయితే కాంగ్రెస్ లో వర్గ పోరు అనేది ఎలా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకొనక్కరలేదు.అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.

అయితే రేవంత్ పీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత చాలా వరకు సీనియర్ లకు, రేవంత్ కు మధ్య చాలా గ్యాప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే.అయితే రేవంత్ పీసీసీ చీఫ్ ప్రకటన ఆలస్యం కావడానికి సీనియర్ ల జోక్యమే ప్రధాన కారణమని అప్పట్లో చాలా వరకు వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే.

అయితే రేవంత్ పై తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగంగానే వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

అయితే మిగతా సీనియర్ లు బహిరంగంగా వ్యతిరేకించకున్నా రేవంత్ కు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు చాలా తక్కువ.

అయితే స్వంత పార్టీలో తాజాగా జరిగిన లుకలుకలపై రేవంత్ మౌనంగా ఉన్న పరిస్థితి ఉంది.అయితే చాలా  వరకు ఇలాంటి విషయాలపై రేవంత్ స్పందించకుండా తాను అనుకున్న రీతిలోనే అనుకున్న వ్యూహాన్నే అమలు పరుస్తున్న పరిస్థితి ఉంది.

అయితే అధిష్టానం రేవంత్ కు ఇచ్చిన భరోసా వల్లే రేవంత్ పార్టీ లుకలుకలపై స్పందించడం లేదు.అయితే రేవంత్ కు సీనియర్ లు సహకరించరనే  విషయం అధిష్టానంకు తెలుసు కాబట్టి సీనియర్ ల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తన వ్యూహాలు పక్కాగా అమలవుతున్న తరుణంలో సీనియర్ ల విమర్శలపై స్పందించడం లేదని కాంగ్రెస్ లోనే అంతర్గత చర్చ జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube