క్షేత్ర స్థాయి బలోపేతంపై రేవంత్ దృష్టి.. సత్ఫలితాలిస్తోందా?

తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది.అయితే రేవంత్ పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

 Rewanth's Focus On Field Level Strengthening .. Is It Workin Telangana Congress, Revanth Reddy, Ts Poltics , Congress, Trs Party , Kcr ,-TeluguStop.com

అయితే ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది ప్రారంభించిన నేపథ్యంలో పార్టీ సభ్యత్వ ప్రక్రియను చాలా వ్యూహాత్మకంగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటి నుండో ఇటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న పార్టీ.

అయితే రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయినా తెలంగాణలో మాత్రం అధికారం దక్కించుకోలేక పోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా పూర్తి పటుత్వాన్ని మాత్రం కోల్పోని పరిస్థితి ఉంది.

 Rewanth's Focus On Field Level Strengthening .. Is It Workin Telangana Congress, Revanth Reddy, Ts Poltics , Congress, Trs Party , Kcr , -క్షేత్ర స్థాయి బలోపేతంపై రేవంత్ దృష్టి.. సత్ఫలితాలిస్తోందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ తరువాత అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కాస్త మసకబారడం,అంతేకాక స్వంత పార్టీ నేతలపైనే బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టించుకోవడం మానేయడంతో ఇక ఆ తరువాత జరిగిన ప్రతీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటలేక పోయింది.

దీంతో రేవంత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలనే ప్రక్రియను ప్రారంభించారు.

కాని కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ లక్ష్యం 30 లక్షలు టార్గెట్ పెట్టుకున్నా ఇప్పటికే 30 లక్షల మార్క్ దాటి పరుగులు పెడుతోందని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వస్తోందని పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు.దీంతో నేడు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై రేవంత్ పార్టీ నేతలకు ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.మరి రేవంత్ సభ్యత్వ నమోదు వ్యూహం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube