కేటీఆర్ ను మరో సారి టార్గెట్ చేసిన రేవంత్.. అసలు వ్యూహం ఇదేనా?

Rewanth Who Targeted Ktr Once Again Is This The Real

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు అధికార , ప్రతిపక్షాల మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కొరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

 Rewanth Who Targeted Ktr Once Again Is This The Real-TeluguStop.com

అయితే కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ విమర్శల పట్ల కాని, నిరసనల పట్ల కాని ఏ మాత్రం స్పందించని పరిస్థితి ఉంది.

దీంతో బీజేపీకి ప్రజల్లో వస్తున్న స్పందనతో పోలిస్తే కాంగ్రెస్ కు కాస్త తక్కువగా ఉంది.

 Rewanth Who Targeted Ktr Once Again Is This The Real-కేటీఆర్ ను మరో సారి టార్గెట్ చేసిన రేవంత్.. అసలు వ్యూహం ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాల పట్ల స్పందించడానికి గతంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కూడా ఆసక్తి చూపించని విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీని జాకీలు వేసినా లేపినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా కేటీఆర్, రేవంత్ మధ్య మరోసారి మాటల దాడి జరుగుతోంది.

ట్విట్టర్ లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో రేవంత్ తో డిబేట్ కు వెళ్తారా అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఇచ్చిన సమాధానం రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.అటువంటి క్రిమినల్స్ తో, 420 లతో డిబేట్ కు రానని కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై ఇంకా రేవంత్ రెడ్డి స్పందించనప్పటికీ అసలు స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.అయితే కేటీఆర్ ను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల దృష్టిని కాంగ్రెస్ వైపు పడేలా చూసుకోవాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహంలా కనిపిస్తోంది.

Video : Rewanth Who Targeted KTR Once Again .Is This The Real Strategy Ktr, Revanth Reddy , Ts Poltics, Ts Congress, Bjp Party , Ktr, Trs Party, Kcr

Rewanth who targeted KTR once again .Is this the real strategy ktr, revanth reddy , ts poltics, ts congress, bjp party , ktr, trs party, kcr - Telugu @ktrtrs, @revanth_anumula, Bjp, Telangana, Trs, Ts Congress, Ts Poltics

#@KTRTRS #Congress #Trs #Poltics #Bjp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube