ఆ విష‌యంలో బీజేపీ కంటే ముందున్న రేవంత్‌.. అంత‌లా ఎఫెక్ట్ చూపుతున్నాడా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న హ‌వా చాటేందుకు టీపీసీసీ ప్రెసిడెంట్ గా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.ఇప్పుడు ఆయ‌న పార్టీ ప‌గ్గాలు తీసుకున్న త‌ర్వాత ఎక్కువ‌గా టీఆర్ ఎస్ మీద‌నే ఫోక‌స్ పెడుతున్నారు.

 Rewanth Who Is Ahead Of Bjp In That Regard Is Showing Such An Effect-TeluguStop.com

ఎంత‌మంది ఆయ‌న్ను వ్య‌తిరేకిస్తూ పార్టీని వీడుతున్నా కూడా ఆయ‌న త‌న ప్లాన్ ను వ‌ర్కౌట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.ఇక ఇప్పుడు టీఆర్ ఎస్ ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తూ క‌నిపిస్తున్నా కూడా మ‌రీ ముఖ్యంగా ఆయ‌న బీజేపీని నిలువ‌రించేందుకు ప్లాన్ చేస్తు్నారు.

ఇందులో భాగంగా టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేఏకంగా ఉంటున్న‌ కీల‌క నేత‌ల‌ను త‌న కాంగ్రెస్‌లోకి మ‌ళ్లించేందుకు ఆయ‌న ప్లాన్ వేస్తున్నారు.వారంతా బీజేపీలోకి వెళ్తే త‌న‌కు ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని, కాబ‌ట్టి బీజేపీని బ‌ల‌ప‌డ‌నీయకుండా ఉంచేందుకు వ‌రుస‌గా నేత‌ల‌ను ఆహ్వానిస్తున్నారు.

 Rewanth Who Is Ahead Of Bjp In That Regard Is Showing Such An Effect-ఆ విష‌యంలో బీజేపీ కంటే ముందున్న రేవంత్‌.. అంత‌లా ఎఫెక్ట్ చూపుతున్నాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా తాజాగా టీటీడీపీ సీనియర్ నేత అయిన దేవేందర్ గౌడ్ లాంటి కీల‌క నేత‌ల‌ను క‌లుస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారు.ఇప్ప‌టికే కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి లాంటి కీల‌క నేత‌ల‌ను కూడా క‌లిసి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

వీట‌న్నింటినీ బ‌ట్టి చూస్తుంటే రేవంత్ రెడ్డి రాజకీయం రొటీన్ కంటే చాలా భిన్నంగా ఉందనే టాక్ జోరుగా సాగుతోంది.

Telugu Bandi Sanjay, Bjp, Kcr, Konda Vishweshwar Reddy, Ravanth Target Bjp, Revanth, Telangana Congress, Tpcc Revanth Reddy, Ts Politics, Ttdp Devender Goud-Telugu Political News

అంద‌రిలాగా డైరెక్టుగా ఒక పార్టీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేయ‌కుండా డైరెక్టుగా టీఆర్ ఎస్‌ను హైలెట్ చేస్తున్న‌ట్టు కిన‌పిస్తున్నా కూడా ఇన్ డైరెక్టుగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది.మ‌రీ ముఖ్యంగా యూత్ నాయ‌కుల‌ను బీజేపీవైపు మ‌ళ్ల‌కుండా కాంగ్రెస్‌లోకి వ‌చ్చే విధంగా ప్లాన్ వేస్తున్నారు.ఇది రేవంత్‌కు చాలా ప్ల‌స్ అనే తెలుస్తోంది.

మొత్తానికి రేవంత్ ప్లాన్ బీజేపీని బాగానే దెబ్బ‌కొడుతోంద‌ని చెప్పాలి.మ‌రి రేవంత్ ప్లాన్‌ను బీజేపీ తిప్పి కొట్టేందుకు వ‌ల‌స‌ల ప్లాన్ వేస్తుందా లేదా అన్న‌ది వేచి చూడాలి.

#Bandi Sanjay #Revanth #Ts Politics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు