ఆ మిస్టేక్‌ను ప‌దేప‌దే చేస్తున్న రేవంత్‌.. ఇక‌నైనా దానిపై స్పందిస్తారా..?

రేవంత్ రెడ్డి అనుకున్న‌ట్టుగానే ఎంతో క‌ష్ట‌ప‌డి పంతం నెట్టించుకుని మ‌రీ టీపీసీసీ పీఠంపై కూర్చున్నారు.ఇక ఆయ‌న నియామ‌కాన్ని ఎంత‌మంది వ్య‌తిరేకించినా కూడా ఆయ‌న ఆవేవీ పట్టించుకోకుండా ప‌గ్గాలు చేత‌బ‌ట్టారు.

 Rewanth Who Has Been Making That Mistake Over And Over Again .. Will You Respond-TeluguStop.com

ఇక ఆయ‌న‌పై మొద‌టి నుంచి వ్య‌తిరేకంగా ఉంటున్న సీనియ‌ర్లు ఒక్క‌రొక్క‌రుగా దారిలోకి వ‌స్తున్నారు.ఆయ‌న స్పీడ్‌ను చూసి ఇత‌ర పార్టీల్లోని నేత‌ల‌ను త‌న పార్టీలోకి తీసుకురావ‌డం చూసి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్లో కూడా విప‌రీతంగా జోష్ పెరిగింది.

ఇక ఇలాగే ఉంటే లాభం లేద‌నుకుని కాంగ్రెస్ సీనియ‌ర్లు కూడా దారిలోకి వ‌స్తున్నారు.

అయితే మొద‌టి నుంచి రేవంత్‌పై సొంత పార్టీతో పాటు ప్ర‌తిప‌క్షాల్లో కూడా ఓ ముద్ర బ‌లంగా వినిపిస్తోంది.

ఆయ‌న చంద్ర‌బాబు ఏజెంట్ అని చంద్ర‌బాబును ఎందుకు పొగుడుతున్నారంటూ ప్ర‌తి ఒక్క‌రూ కూడా విమ‌ర్శిస్తూనే ఉన్నారు.కానీ ఆయ‌న మాత్రం ఇలాంటి విమ‌ర్శ‌లపై మౌనంగానే ఉంటున్నారు.మిగతా విష‌యాల్లో కౌంట‌ర్ల‌కు రీ కౌంట‌ర్లు ఇస్తున్న రేవంత్ చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే మాత్రం కొంత సైలెంట్ అయిపోతున్నారు.చంద్ర‌బాబుపై తెలంగాణ‌లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది.

ఆయ‌న పేరు చెప్పి టీఆర్ ఎస్ ఓట్ల రాజ‌క‌యం చేస్తోందంటే ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

Telugu Chandrababu, Revanth, Scongress, Tpcc, Ts-Telugu Political News

అలాంటిది రేవంత్‌ను చంద్ర‌బాబే నియ‌మించార‌ని, కాంగ్రెస్‌ను ఆయ‌న కొనుక్కున్నారంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు మాత్రం రేవంత్ గ‌ట్టిగా కౌంట‌ర్ విస‌ర‌లేక‌పోతున్నారు.దీంతో ఆయ‌న‌పై ఈ ముద్ర ఇలాగే కొన‌సాగితే అది కాస్తా ప్ర‌తిప‌క్షాల‌కు మంచి అస్త్రంగా మారే ప్ర‌మాదం కూడా ఉంది.చివ‌ర‌కు ఎన్నిక‌ల్లో దీన్నే టార్గెట్‌గా చేసుకుని విప‌క్షాలు ఓట్లు ద‌న్నుకునే అవ‌కాశం కూడా లేక‌పోలేదు.

మ‌రి దీనిపై గ‌ట్టిగా కౌంట‌ర్ ఇస్తేగానీ రేవంత్‌పై ఈ మ‌చ్చ పోద‌నే వాద‌న ఆయ‌న అభిమానుల్లో వినిపిస్తోంది.చూడాలి మ‌రి రేవంత్ ఇక‌నైనా దీనిపై ఏమైనా స్పందిస్తారో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube