టార్గెట్ ఫిక్స్ చేసుకున్న రేవంత్ ? ఆ ఎమ్మెల్యేల్లో వణుకు ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించ బోతున్న రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు తన పదవికి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు.అసలు ముందుగా ఏ అంశాలపై పోరాటం చేయాలని అనుకుంటున్నారు.

 Trs, Kcr, Telangana, Congress Mla's, Bjp, Pcc Chief Telangana Congress Mla's, Tr-TeluguStop.com

అనే అంశంపై ఆయన ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాంగ్రెస్ కి అనేకంటే రేవంత్ కు  ప్రధాన శత్రువుగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ పైన,  ఆ పార్టీ అగ్ర నాయకుల వ్యవహారాలపై దృష్టి పెట్టి పోరాటాలు మొదలు పెడతారని , టిఆర్ఎస్ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన తెలంగాణ అంతటా పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటన చేస్తారని అందరూ అభిప్రాయపడుతున్నారు.

అయినా రేవంత్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.అందుకే ముందుగా ఈ వ్యవహారాలన్నీ పక్కనపెట్టి కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన నాయకులను పూర్తిగా టార్గెట్ చేసుకోబోతున్నట్లు సమాచారం.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 18 మంది ఎమ్మెల్యేలు గెలవగా 12 మంది టీఆర్ఎస్ లో చేరిపోయారు.అక్కడితో ఆగకుండా టీఆర్ఎస్ఎల్పీ లో సిఎల్పి విలీనం చేస్తూ స్పీకర్ కు లేఖ ఇవ్వడం వంటి వ్యవహారాలు కాంగ్రెస్ ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేశాయి.

కాంగ్రెస్ కు ఓట్లు వేసినా అనవసరం అనే అభిప్రాయం జనాలలోను కలగడం తదితర కారణాలతో పూర్తిగా కాంగ్రెస్ ప్రభావం లేదు అని తెగిపోయింది.అయితే ఈ విషయం గుర్తించిన రేవంత్ కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుంటూ, వారు రాజీనామా చేయాలని డిమాండ్ ఉద్యమం మొదలు పెట్టేలా కనిపిస్తున్నారు.

Telugu Congress Mlas, Pcctelangana, Telangana, Trs-Telugu Political News

 అప్పుడే కాంగ్రెస్ పై నమ్మకం కలుగుతుందని, అలాగే తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు టీఆర్ఎస్ వైపు వెళ్లేందుకు సాహసించరు అనే లెక్కలు రేవంత్ వేసుకుంటున్నట్లు గా కనిపిస్తున్నారు.కాంగ్రెస్ కు ఓటు వేసినా, టిఆర్ఎస్ కు వేసినట్లే అభిప్రాయం జనాల నుంచి పోగొట్టేందుకు ఇదే అంశంపై మొదటి పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.ఈ పరిణామాలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో ఆందోళన కలిగిస్తోంది.రేవంత్ పోరాటం వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా,  రాబోయే ఎన్నికల సమయంలో ఈ వ్యవహారాలు తమ కొంప ముంచుతాయేమో అనే టెన్షన్ సదరు ఎమ్మెల్యే ల్లో అప్పుడే మొదలయ్యిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube