హుజూరాబాద్ కు ఇన్‌చార్జుల‌ను నియ‌మించిన రేవంత్‌.. పొన్నంకు టికెట్ లేన‌ట్టేనా..?

అదేంటోగానీ కాంగ్రెస్ పార్టీ ఏ ప‌నిచేసినా అది చివ‌ర‌కు విఫ‌ల‌మే అవుతోంది.చివ‌ర‌కు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి పీసీసీ ప‌ద‌వి ఇస్తే ఏమైనా మార్పు వ‌స్తుందేమో అని ఆశించిన పార్టీకి మ‌ళ్లీ అడియాశ‌లే మిగులుతున్నాయి.

 Rewanth Who Appointed In Charges To Huzurabad Is There No Ticket For Ponnam Prab-TeluguStop.com

ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత మొద‌టిసారి జ‌రుగుతున్న ఉప ఎన్నిక కావ‌డం, అదికూడా చాలా గ‌ట్టిపోటీ ఉన్న ర‌ణ‌రంగం అయిన హుజూరాబాద్ కావ‌డంతో రేవంత్‌కు పెద్ద స‌వాలే అని చెప్పొచ్చు.మ‌రి అలాంట‌ప్పుడు ఆయ‌న ఇంకెంత జాగ్ర‌త్త‌గా ప‌నిచేయాలి అని అనుకుంటే ఏకంగా అక్క‌డ కాంగ్రెస్‌కు దిక్కుగా ఓ అభ్య‌ర్థిగా ఉన్న కౌశిక్‌రెడ్డే రాజీనామా చేసేదాకా వ‌చ్చింది.

ఇప్పుడు అభ్య‌ర్థి కూడా ఆ పార్టీకి క‌ష్ట‌మే అని చెప్పొచ్చు.ఇక మొన్న‌టి వ‌ర‌కు క‌రీంన‌గ‌ర్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌కు టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది.

అయితే వీట‌న్నింటికీ చెక్ పెడుతూ రేవంత్ ఆయ‌న్ను స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మిస్తూ ఆ ప్ర‌శ్న‌లకు స‌మాధానం ఇచ్చారు.మ‌రి ఎప్పుడో నియ‌మించాల్సిన ఇన్ చార్జుల‌ను అభ్య‌ర్థి కూడా ఉన్న వ్య‌క్తి కూడా రాజీనామా చేసేదాకా ఎందుకు చూశార‌నేది ఇప్పుడు అర్థంకాని ప్ర‌శ్న‌.

ఇప్పుడు అభ్య‌ర్థి లేకుండానే వీరంద‌రినీ నియ‌మించ‌డం ఏంట‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుమానిస్తున్నారు.

Telugu Mpponnam, Huzurabad, Jeevan Reddy, Revanth-Telugu Political News

ఇక రేవంత్ తాజాగా హుజురాబాద్ ఉపఎన్నికు నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇన్ చార్జులను అలాగే సమన్వయ కర్తలతో పాటుగా ఐదు మండలాల‌కు బాధ్యులను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసి అనేక అనుమానాల‌కు తెర లేపారు.హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల‌కు ఇన్‌ఛార్జ్ గా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను నియమించ‌గా.సమన్వయ కర్తలుగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, క‌రీంన‌గ‌ర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నియ‌మించి పొన్నం టికెట్ ఇవ్వ‌ట్లేద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube