కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తాడంట రేవంత్‌.. సీఎంపై క్లారిటీ ఇచ్చేశాడుగా!

ఇలా టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడో లేదో అలా ప‌రుగులు పెడుతున్నాడు రేవంత్‌రెడ్డి.అప్పుడు పార్టీని అధికారంలోకి తెస్తానంటూ స‌వాల్ కూడా విసిరేస్తున్నాడు ఈ కొత్త ప్రెసిడెంట్‌.

 Rewanth Wants To Bring Congress To Power As If He Gave Clarity On Cm, Revanth, C-TeluguStop.com

ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ముందుకు వెళ్తానంటూ త‌న వ్యూహాల‌ను కూడా చెప్పేస్తున్నాడు.కాంగ్రెస్ వ‌రుస‌గా ప‌దేళ్లు పాలించింద‌ని, ఇప్పుడు టీఆర్ ఎస్ కూడా ప‌దేళ్ల పాటు అంటే 2023 వరకు కేసీఆర్ పాలన ఉంటుందని, ఆ త‌ర్వాత మారుతుంద‌ని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ‌లో ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజల ఇప్ప‌టికే నిర్ణ‌యించార‌ని, త్వ‌ర‌లోనే అది జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు.అయితే ఈ విష‌యం సీఎం కేసీఆర్‌కు కూడా అర్థ‌మ‌యింద‌ని వివ‌రిస్తున్నారు రేవంత్‌.

చాలామంది దీన్ని కాస్త ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అన్నా కూడా ఆయ‌న మాత్రం ప‌నిచేస్తే అది సాధ్య‌మే అన్న‌ట్టు ముందుకెళ్తున్నారు.ఇక టీఆర్ ఎస్‌కు ప్ర‌తిప‌క్షం కూడా తామే అంటూ తేల్చి చెబుతున్నారు.

అలాగే త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న సీనియ‌ర్ల అసమ్మతి టీ కప్పులో తుఫాన్ లాంటిదంటూ త‌న‌ను తాను స‌పోర్టు చేసుకునే వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

Telugu @revanth_anumula, Cm Kcr, Congrss, Revanth Reddy, Sonia Gandhi, Telangana

వారంద‌రూ త‌న‌కే మ‌ద్ద‌తు ఇస్తార‌ని, ఎలాంటి వివాదాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు.ఇక కాంగ్రెస్‌ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావడమే త‌న త‌రువాయి అన్న‌ట్టు చెబుతున్నారు.అంతే కాదు పార్టీలో ఎవరు ఏ స్థాయిలో ఉండాలనేది త‌మ అధినేత్రి అయిన సోనియాగాంధీ మాత్ర‌మే చెబుతార‌ని, దానికే తామంతా క‌ట్టుబ‌డి ఉంటామ‌ని వివ‌రిస్తున్నారు.

Telugu @revanth_anumula, Cm Kcr, Congrss, Revanth Reddy, Sonia Gandhi, Telangana

ఇక కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే సీఎం ఎవ‌ర‌న్న దానిపై కూడా ఇప్పుడే క్లారిటీ ఇచ్చేశారు రేవంత్‌.సోనియా గాంధీ ఎవ‌రిని నియ‌మిస్తే వారే సీఎం అభ్య‌ర్థి అని వివ‌రించారు.అంతే కానీ ఎవ‌రికి వారే ప్ర‌క‌టించుకోబోమ‌ని వివ‌రించారు.అంటే క‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమాతో క‌నిపిస్తున్నారు రేవంత్.చూడాలి మ‌రి ఆయ‌న ఆశ‌లు ఏ మేర‌కు స‌క్సెస్ అవుతాయో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube