సీనియర్లను ఇరకాటంలో నెట్టేలా రేవంత్ వ్యూహం?

Rewanth Strategy To Push Seniors Into Conflict Rewanth Reddy,congress Party Ts Poltics ,revanth Redy ,uttam Kumar Reddy ,ts Congress,batti Vikramarka,

ప్రస్తుతం తెలంగాణలో ప్రభావం కోల్పోయే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ను గాడిలో పెట్టడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారు.అయితే ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ను అందరూ ఒక్కటై నడిపించాల్సిన నాయకులు గ్రూపులుగా ఏర్పడి ప్రజల సమస్యలపై పోరాడకపోవడంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని రుచి చూసిన పరిస్థితి ఉంది.

 Rewanth Strategy To Push Seniors Into Conflict Rewanth Reddy,congress Party Ts-TeluguStop.com

ఇప్పటికీ గ్రూపుల కుమ్ములాటలు తగ్గకపోవడంతో సీనియర్ నేతలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు ఒక వినూత్న కార్యక్రమాలకు తెరదీశారు.రైతులతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా రైతు వ్యతిరేక చట్టాలపై రైతులకు జరిగే నష్టంపై వివరించారు.

అలాగే రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పేరిట పాదయాత్రను చేపట్టగా ముగింపు సభను ఏర్పాటు చేసారు.

అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతం కావడంతో ఆ ముగింపు సభకు సీనియర్లు ఎవరూ హాజరు కాకపోవడంతో ఇప్పుడు చూపంతా సీనియర్లపై పడింది.

ఒక్కడిగా రేవంత్ పోరాడుతున్నాడని, సీనియర్లు ఎందుకు సహకరించడం లేదని రేవంత్ పై సానుభూతి వ్యక్తమవుతోంది.ఇప్పుడు ఈ సంఘటనలతో సీనియర్లు ఇరకాటంలో పడ్డారని చెప్పవచ్చు.మరి ఈ వ్యవహారంపై సీనియర్లు ఏమని వ్యాఖ్యానిస్తారో చూడాల్సి ఉంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube