మాజీ కాంగ్రెస్ నేతలపై రేవంత్ రెడ్డి ఫోకస్... అసలు వ్యూహం ఇదే

తెలంగాణ రాష్ట్రంలో రాజాకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఉంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ అత్యంత బలమైన పార్టీగా ఉన్న పరిస్థితి ఉంది.

 Rewanth Reddy's Focus On Former Congress Leaders ... This Is The Real Strateg T-TeluguStop.com

అయితే రాను రాను పార్టీలో నెలకొన్న సంక్షోభం కారణంగా రాను రాను వెనకబడ్డ పరిస్థితి ఉంది.ఇక పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ నియామకం తర్వాత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.

ఇక పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించిన తరువాత కాంగ్రెస్ లో రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయిన విషయం తెలిసిందే.అయితే అందుకే పీసీసీ చీఫ్ గా ప్రకటించిన తరువాత అందరి సీనియర్ లను కలిసి కాంగ్రెస్ పటిష్టతకు తన వద్ద ఉన్న ఆలోచనలను పంచుకున్న పరిస్థితి ఉంది.

అయితే కాంగ్రెస్ బలహీనపడడానికి ప్రధాన కారణం కాలానుగుణంగా రాజకీయంగా వచ్చిన మార్పులకనుగుణంగా సదరు నేతలు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ను విడిచిపెట్టి వెళ్ళిన నేతలు ఎంతో మంది ఉన్నారు.అందుకే ఇప్పుడు ఆ నేతలపై పీసీసీ చీఫ్ రేవంత్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

అందుకే తాజాగా  సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ తో రేవంత్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Telugu @revanth_anumula, Srinivas, Gandrasathaya, Huzurabad, Rewanth Reddy, Ts P

ఇటీవల గండ్ర సత్యనారాయణ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో  చేరిన విషయం తెలిసిందే.అందుకే మాజీ కాంగ్రెస్ నేతలపై ఫోకస్ పెట్టడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని రేవంత్ చేస్తున్న ఈ ఆలోచన సఫలమైతే కాంగ్రెస్ మరింత పటిష్టమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.మరి రానున్న రోజుల్లో రేవంత్ వ్యూహాలు కాంగ్రెస్ ను ఎంత వరకు పటిష్ట పరుస్తాయనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube