రేవంత్ టార్గెట్ లో వీరందరూ ? మొదలెట్టేశారుగా ? 

మొత్తానికి పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డి తన కొత్త టార్గెట్ ఏంటో అప్పుడే గ్రహించే చేశారు.బిజెపి ,టిఆర్ఎస్ ఎంఐఎం, షర్మిల ఇలా అన్ని పార్టీలను ఎదుర్కుంటేనే కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం దక్కుతుందనే విషయాన్ని ఆయన గ్రహించారు.

 Revanth Reddy Who Completely Targets Bjp Trs, Revanth Reddy, Telangana, Pcc Pres-TeluguStop.com

వీటితో పాటు సొంత పార్టీలోని అసంతృప్తి నాయకులను భయపెట్టో , బుజ్జగించో తన దారిలోకి తెచ్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తుతాయని విషయాన్ని రేవంత్ గ్రహించారు.పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ పేరు అధిష్టానం ప్రకటించగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.

ఆయన ఆధ్వర్యంలో మళ్లీ పార్టీకి పునర్ వైభవం వస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.జూలై 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ అంతకు ముందు గానే రాజకీయ శత్రువులు అందర్నీ టార్గెట్ చేసుకున్నారు.

ముఖ్యంగా బిజెపి,  టిఆర్ఎస్ కీలక నేతలను టార్గెట్ చేసుకుంటూ రేవంత్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.పైకి వేరువేరుగా కనిపిస్తున్నా, బిజెపి టిఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ఈ రెండు పార్టీల నుంచి తెలంగాణ కు విముక్తి కల్పించాలంటూ రేవంత్ మాట్లాడుతున్నారు .
  అసలు తెలంగాణలో బీజేపీకి బలమే లేదని , అలాగే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందని చెబుతున్నారు.ఇక బిజెపి బలం ఎంఐఎం కి ఎంత ఉంది అనేది ఆయన చెప్పుకొస్తున్నారు.

ఒకవైపు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ టార్గెట్ చేసుకుంటునే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.జిహెచ్ఎంసి ఎన్నికల్లో బండి కి బండి , కారికి కారు ఇస్తాము అని సంజయ్ అబద్ధాలు చెప్పి ఆ పార్టీకి 47 కార్పొరేటర్లు గెలిచేలా చేసుకున్నారని, కానీ గెలిచిన తర్వాత బండి లేదు గుండు లేదు అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు.

Telugu Asaduddin, Bandi Sanjay, Pcc, Revanth Reddy, Telangana, Ys Sharmila, Ysrt

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు అంటూ రేవంత్ విమర్శలు మొదలు పెట్టారు.పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో మరింత దూకుడుగా రాజకీయ వ్యవహారాలు చేయాలని రేవంత్ ఫిక్స్ అయ్యారు.దీనిలో భాగంగానే పాదయాత్ర కూ ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టు గా కనిపిస్తున్నారు.మొత్తంగా తెలంగాణ లో ఇక పై తన మార్క్ రాజకీయం ఎలా ఉండబోతోందో రేవంత్ ఇప్పటి నుంచే చూపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube