రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టాల్సిందేనా ? 

ఇప్పుడు తెలంగాణలో వరుసగా పాదయాత్రల సీజన్ మొదలైపోయింది.తమ ప్రాధాన్యం పెంచుకునేందుకు తమ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పాదయాత్రలు దోహదపడతాయని నాయకులు నమ్మకంతో ఉండడంతో,  అందరూ అదే బాట పడుతున్నారు.

 Revanth Reddy, Trs, Kcr, Telangana, Hujurabad, Etela Rajender, Sharmila, Ysrtp,-TeluguStop.com

పాదయాత్ర చేపట్టిన వారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అనే సెంటిమెంట్ ఎప్పటి నుంచో నాయకుల్లో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి ఆ తర్వాత కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. వైసిపి అధినేత జగన్ పాదయాత్ర ద్వారా 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించారు అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇదే విధంగా యాత్ర నిర్వహించారు.

ఇప్పుడు అదే సెంటిమెంట్ ను తెలంగాణలోనూ నాయకులు పాటిస్తున్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తుండగా అంతకుముందు ఈటెల రాజేందర్ తన నియోజకవర్గంలో కొద్ది రోజులపాటు పాదయాత్ర నిర్వహించారు.

వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల కూడా పాదయాత్ర ను నమ్ముకున్నారు .అయితే వీరందరి కంటే ముందుగా ఎప్పటి నుంచో పాదయాత్ర నిర్వహించాలని ఉత్సాహపడుతున్నారు రేవంత్ రెడ్డి.ఈ విషయంలో వెనకబడి పోయాయి.దీనికి కారణం పాదయాత్రకు పార్టీ సీనియర్లు అడ్డు తగలడమే.  ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాత్రమే అప్పుడు ఉన్నారు.అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర నిర్వహించి బలం పెంచుకోవాలని , అలాగే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో ఉన్నారు.దీనికి తగ్గట్లుగానే ఇప్పుడు రేవంత్ ప్రభావం బాగా పెరిగింది. కేసీఆర్ , కేటీఆర్ ను ఇరుకున పెట్టడంతో పాటు, టిఆర్ఎస్ ప్రభావం

Telugu Congress, Etela Rajender, Hujurabad, Revanth Reddy, Sharmila, Telangana,

డ్రగ్స్ వ్యవహారంలో రేవంత్ సవాళ్లకు కేటీఆర్ సరిగా స్పందించకపోవడం, వంటివి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయి.ఈ క్రమంలో రేవంత్ ఇదే అనువైన సమయంగా భావించి పాదయాత్ర నిర్వహిస్తే కాంగ్రెస్ తో పాటు , ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందని ఆయన సన్నిహితుల అభిప్రాయం.ఈ మేరకు రేవంత్ సైతం తన పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నాలలో ఉన్నట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube