బీజేపీ టీఆర్ఎస్ బంధానికి రేవంత్ సాయం ?

తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ ను గద్దె దించడమే కాంగ్రెస్, బిజెపిల ప్రధాన ధ్యేయం.ఆ దిశగానే రెండు పార్టీలు రాజకీయాలు చేస్తూ వస్తున్నాయి.

 Rewanth Reddy Is Working To Increase The Alliance Between The Bjp And The Trs, B-TeluguStop.com

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు కాకముందు, టిఆర్ఎస్ బిజెపిల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది.

  కానీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆ అభిప్రాయం మారిపోయింది.కాంగ్రెస్ ను టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకెళ్లడంలో రేవంత్ సక్సెస్ అవుతూ వస్తున్నారు.

నిరంతరం అనేక సభలు, సమావేశాలు , ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పేరు మారుమోగే విధంగా చేస్తున్నారు.సీఎం కేసీఆర్ కేటీఆర్ లకు నిత్యం సవాళ్ళు విసురుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

దీంతో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం మారిపోయింది.

టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపి కాదు అని,  కాంగ్రెస్ అనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లడం తో రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

తెలంగాణలో రేవంత్ దూకుడు తగ్గిస్తే బిజెపి టిఆర్ఎస్ లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని,  పోటీ రెండు పార్టీల మధ్యే ఉంటుందని , అలా కాకుండా సైలెంట్ గా ఉంటే రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసి అధికారం దక్కించుకునే స్థాయికి పార్టీని తీసుకెళ్తారనే ఆందోళన రెండు పార్టీల నేతలలోను ఉంది.ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర బిజెపి పెద్దలను కేసీఆర్ కలిసిన సమయంలో రేవంత్ వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం.

రేవంత్ దూకుడు తగ్గించకపోతే, ముందు ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని క్లియర్ గా చెప్పడంతో  బీజేపీ నేతలు ఆలోచనలో పడ్డారట.
 

Telugu Amith Sha, Congress, Etela Rajender, Kcr Delhi, Modhi, Revanth Reddy, Pcc

ఇప్పటికీ రేవంత్ పై అనేక కేసులు పెండింగ్ లో ఉండడంతో వాటిని అడ్డం పెట్టుకుని రేవంత్ ను ఇబ్బందులు పెట్టాలని , అలా అయితేనే రెండు పార్టీలకు ఇబ్బంది ఉండదు అనే విషయాన్ని కెసిఆర్ కేంద్ర బిజెపి పెద్దల వద్ద ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఒకరకంగా బిజెపి టిఆర్ఎస్ మధ్య బంధం పెరగడానికి రేవంత్ కారణం అవుతున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube