ప్రవీణ్ కోసం కాంగ్రెస్ వెయిటింగ్ ? ఆయనొస్తే ఆ లెక్కే వేరులే ?

కొద్ది రోజుల క్రితం ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు సొంత పార్టీ పెట్టబోతున్నారా లేక మరేదైనా పార్టీలో చేరబోతున్నారా అనే విషయం అంతు పట్టడం లేదు.దళిత వర్గానికి చెందిన ప్రవీణ్ ను చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో బలం పెంచుకోవచ్చని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.

 Revanth Reddy Is Trying To Get Praveen Kumar To Join Congress, Rs Praveen Kumar,-TeluguStop.com

అసలు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వ్యవహార శైలి కారణంగా ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు కాబట్టి, టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆయన ను బాణంలా ఉపయోగించుకోవచ్చు అని బిజెపి, కాంగ్రెస్ వంటి పార్టీలు ఆలోచిస్తున్నాయి.ప్రవీణ్ కుమార్ సొంతంగా పార్టీ పెడతారని అందుకే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారని ఒక ప్రచారం నడుస్తుండగా, టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏ పార్టీ అయినా అందులో చేరి పోరాడతారు అంటూ కాంగ్రెస్ బీజేపీలు ఆశలు పెట్టుకున్నాాయి.

ప్రవీణ్ కుమార్ వంటి బలమైన సామాజిక నేపథ్యం ఉన్న నేతలను చేర్చుకుంటే , ఆయన కు సంబంధించిన ‘ స్వెరో ‘ సంస్థ సభ్యుల అండదండలు కలిసి వస్తాయని, ఆయన గురుకులాల కార్యదర్శిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో, అక్కడ చదువుకున్న విద్యార్థులు వారి కుటుంబాలలో ప్రవీణ్ కుమార్ పై అభిమానం అవన్నీ తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది.ఇప్పటికీ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవీణ్ కుమార్ ను చేర్చుకునే విషయంలో కీలక ప్రకటన చేశారు ఇటీవల జరిగిన టిపిసిసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో అనే అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా దళితుడి ని సీఎం చేస్తానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించాల్సిన అవసరం ఉందంటూ ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు.

Telugu Huzurabad, Ipspraveen, Pcc, Revanth Reddy-Political

ప్రవీణ్ కుమార్  ను గురుకులాల కార్యదర్శిగా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇచ్చారని, ఆయన కాంగ్రెస్ లో చేరుతాము అంటే హృదయపూర్వక ఆహ్వానం పలుకుతామని ఆ సమావేశంలో నేతలు వ్యాఖ్యానించారు.అయితే బిజెపి మాత్రం గతంలో ప్రవీణ్ కుమార్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఆయనను తమ పార్టీలో చేరాలని ఆహ్వానించే విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం ఇప్పటికిప్పుడు తన నిర్ణయాన్ని వెల్లడించే లా కనిపించడం లేదు.

సొంత పార్టీ పెట్టడమా, ఏదైనా పార్టీలో చేరాలా అనే  విషయంలో ఆయన మరికొంతకాలం సస్పెన్స్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube