కాంగ్రెస్ టూ టీఆర్ఎస్ ... టీఆర్ఎస్ టూ కాంగ్రెస్ ! రేవంత్ కు సాధ్యమేనా ?

Rewanth Reddy Is Planning To Bring Back The Mlas Who Joined Trs From Congress

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను ముప్పుతిప్పలు పెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నిస్తూనే వస్తున్నారు.పిసిసి అధ్యక్షుడు కాక ముందు నుంచే ఆయన ఈ విషయంపై దృష్టిపెట్టారు.

 Rewanth Reddy Is Planning To Bring Back The Mlas Who Joined Trs From Congress-TeluguStop.com

ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేపట్టారు.పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత దూకుడుగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.పార్టీలో సీనియర్ నాయకులు సహకరించినా, సహకరించకపోయినా, టిఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయడమే ఏకైక లక్ష్యంగా రేవంత్ పనిచేస్తున్నారు.2018 ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి గెలిచిన దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు.అప్పట్లో ఇవి పెద్ద సంచలనం సృష్టించినా, ఆ తర్వాత అంతా ఈ వ్యవహారాన్ని మర్చిపోయారు.
           అయితే రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇదే అంశంపై ఆయన దృష్టి పెట్టి విమర్శలు చేశారు.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారు రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.అంతేకాదు మీరు రాజీనామా చేయకపోతే , ముందు ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరికలు కూడా చేశారు.

 Rewanth Reddy Is Planning To Bring Back The Mlas Who Joined Trs From Congress-కాంగ్రెస్ టూ టీఆర్ఎస్ … టీఆర్ఎస్ టూ కాంగ్రెస్ రేవంత్ కు సాధ్యమేనా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినా ఆయన నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు.అయితే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన తమకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తితో కొంతమది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అటువంటి వారందరినీ తమ దారికి తెచ్చుకుని కాంగ్రెస్ లో చేర్చుకునే వ్యూహంలో రేవంత్ నిమగ్నమయ్యారు.వీరే కాకుండా టిఆర్ఎస్ లో కొంత మంది అసంతృప్తి నేతలను గుర్తించి,  వారు కాంగ్రెస్ లో చేరే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి రేవంత్ సిద్ధమవుతున్నారు.
     

Telugu Bjp, Congress, Congress Mla\\'s, Hujurabad Elections, Pcc Chief, Pcc President, Revanth Reddy, Telangana Government, Trs-Telugu Political News

   ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలతోనూ రేవంత్ చర్చలు జరిపినట్టు సమాచారం.అంతేకాకుండా అనేక కారణాలతో కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరిన కీలక నాయకులు అందరిని సొంతగూటికి తెచ్చే ప్రయత్నాలు రేవంత్ నిమగ్నం అయ్యారు.ఇదే ఎత్తుగడతో ఎన్నికల వరకు ముందుకు వెళ్తే , తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని,  తెలంగాణలో కాంగ్రెస్ కు తిరుగు లేకుండా చేయడంతోపాటు,  2023 ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు సాధ్యం అవుతుందనే లెక్కల్లో రేవంత్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నాయకులు అందరిని తిరిగి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి  తీసుకువచ్చే బాధ్యతల్లో రేవంత్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు.

#PCC #Telangana #Revanth Reddy #Congress MLAs #Hujurabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube