రేవంత్ చుట్టూ రాజకీయ ఉచ్చు ? ఆయనకు పదవి దక్కనివ్వరా ? 

అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందా అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు మరే పార్టీలోనూ ఉండవు.

 Rewanth Reddy Is Not The Pcc President But The Efforts Of His Own Party Leaders-TeluguStop.com

సొంత పార్టీ నేతలను దెబ్బతీయడమే పనిగా ఎక్కువ మంది నాయకులు పనిచేస్తూ ఉండటం, సొంత పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే విషయంపై తప్ప, మిగతా అన్ని విషయాల్లోనూ యాక్టివ్ గా ఉండడం , అలాగే పార్టీలో సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండడం, వారంతా పార్టీలో తమ ఆధిపత్యం ఎప్పుడూ ఉండే విధంగా వ్యవహారాలు చేయడం, ఇలా ఎన్నో అంశాలు కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంటూ వస్తోంది.పార్టీ బాగా బలం పుంజుకునే విధంగా చేయడంతో పాటు, అధికారం లోకి వచ్చే విధంగా, నూతన ఉత్సాహం కలిగించేందుకు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించి చి చి చి ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

దీనిలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకున్నా, ఆయనకు పదవి ఇస్తే తాము కాంగ్రెస్ లో ఉండము అంటూ సీనియర్లు బెదిరింపులకు దిగడం వంటి కారణాలతో ఎప్పటికప్పుడు తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది.అయినా రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు  ప్రయత్నిస్తున్న సమయంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదో ఒక వ్యవహారం వెలుగులోకి వస్తోంది.

దాన్ని సాకుగా చూపించి అధిష్టానం వద్ద ఫిర్యాదు చేస్తూ, ఆయనకు పదవి దక్కకుండా పావులు కదుపుతూ సీనియర్లు వ్యవహరిస్తున్నారు.

Telugu Congress, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Sonia, Telangana-Telugu Polit

అయితే అధిష్టానం మాత్రం పార్టీ సీనియర్ల వల్ల కలిసొచ్చే దాని కంటే , నష్టం ఎక్కువ జరుగుతోందని, టిఆర్ఎస్ కు దీటుగా కాంగ్రెస్ బలం పుంజుకోవాలి అన్నా, పార్టీ అధికారంలోకి రావాలన్నా,  రేవంత్ వంటివారే సమర్థుడని అధిష్టానం నమ్ముతోంది.అందుకే త్వరలోనే పిసిసి అధ్యక్షుడిగా ఆయన పేరును ప్రకటించేందుకు కాంగ్రెస్ ధిష్టానం సిద్ధంగా ఉండగా యథా ప్రకారం దానిని అడ్డుకునేందుకు సీనియర్లు పావులు కదుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube