వరుస దీక్షలతో కాంగ్రెస్ ను ఒంటిచేత్తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి

ప్రస్తుతం కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ నియామకం వాయిదా వేసిన తరువాత కాంగ్రెస్ క్యాడర్ ని దిశానిర్దేశం చేసే నాయకుడే కరువయ్యారు.అసలే గడ్డు పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒంటి చేత్తో పార్టీ బాధ్యతలను మోస్తున్నట్టు తెలుస్తోంది.

 Rewanth Reddy Is Leading The Congress With A Single Hand With A Series Of Initia-TeluguStop.com

ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అనధికారికంగా స్వీకరించినట్టు తెలుస్తోంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ కు, కార్యకర్తలకు తిరిగి మానసిక స్థైర్యం కలిగించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వరుస దీక్షలను చేపడుతున్నారు.

తాజాగా ఆర్మూర్ పసుపు రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి ఈ దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కొంత అలజడి సృష్టించింది.అయితే దానికి కొనసాగింపుగా మరొక దీక్ష చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఆర్మూర్ లో చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్షకు కొనసాగింపుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో దీక్ష చేపట్టేందుకు సిద్దమవుతున్నాడు.ప్రజల సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ ను తిరిగి గాడిలో పెట్టాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహంలా కనిపిస్తోంది.

ఇలా అన్ని జిల్లాలలో రేవంత్ రెడ్డి దీక్షలు చేపట్టే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube