కేసీఆర్ ఎత్తులు .. రేవంత్ పై ఎత్తులు ! తెరపైకి దామోదర రాజనరసింహ ?

తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పై ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నరో ఆయన నిర్ణయాలు చూస్తేనే అర్థమవుతుంది.ఈటెల రాజేందర్ తో పాటు , కాంగ్రెస్ ప్రభావం లేకుండా చేసి టిఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికను వాటిని అమలు చేస్తున్నారు.

 Damodara Rajanarasimha, Trs, Kcr, Hujurabad, Elections, Revanth Reddy, Trs, Dali-TeluguStop.com

హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినా, ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ హుజురాబాద్ ప్రజల మద్దతు తనకు ఉండేలా చూసుకుంటున్నారు.కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ, ప్రజల్లో టీఆర్ఎస్ పై మరింత ఆదరణ పెరిగేలా చేసుకుంటున్నారు.

రాజేందర్  బలమైన అభ్యర్ధి కావడం,  ఇక్కడ గట్టి పట్టు ఉండడంతో కేసీఆర్ వేలు , లక్షల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు.

దీనిలో భాగంగానే దళిత బందు పథకాన్ని ప్రకటించి కుటుంబానికి 10 లక్షలు అందించే పథకాన్ని ప్రకటించారు.

ఇది కూడా ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం కే కెసిఆర్ పరిమితం చేశారు.దశల వారీగా తెలంగాణ అంతటా అమలు చేస్తామని ప్రకటించారు.దీని ద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా టిఆర్ఎస్ కు పడతాయనేది కెసిఆర్ ఆలోచన.అయితే కెసిఆర్ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఎప్పుడూ ఆయనను ఇరుకున పెట్టే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ దళిత బంధు పథకానికి క్రెడిట్ రాకుండా చేసే వ్యూహరచనలో నిమగ్నమయ్యారు.

Telugu Dalitha Bandhu, Hujurabad, Revanth Reddy, Sc St-Telugu Political News

ఖచ్చితంగా దళిత బందు పథకం తమకు దెబ్బ కొడుతుందని కంగారు పడుతున్న రేవంత్ ఆ సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునే విధంగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.దళిత బంధు పథకానికి కౌంటర్ గా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంశాన్ని రేవంత్ హైలెట్ చేయాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే దళితుల తో గిరిజన సభను నిర్వహించి టిఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అలాగే హుజురాబాద్ నియోజకవర్గానికి ఇప్పటికే దామోదర రాజనర్సింహను ఇన్చార్జిగా నియమించారు.ఇక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రూపకర్త కూడా దామోదర రాజనర్సింహ కావడంతో, ఆయనకు ఆ సామాజిక వర్గాల్లో మంచి గుర్తింపు ఉండటం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్  కారణంగా దళితుల నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా దళితులకే అందేలా కృషి చేయడం వెనుక దామోదర రాజనర్సింహ కృషి  ఉండడం వంటి కారణాలతో ఆ సామాజిక వర్గాల్లో ఆయనకు ఆదరణ ఉంది.అందుకే ఆయనను ఇన్చార్జిగా రేవంత్ నియమించారు.

అంతే కాదు అవసరమైతే ఆయనని హుజురాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీకి దింపే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube