రేవంత్ సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ భోజనాల ప్లాన్ ?

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి విరుగుడుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.భారీఎత్తున ఈ సభకు జనసమీకరణ చేసి టిఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వాలనే ప్లాన్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు.

 Trs Latest Plan To Disrupt Revanth Reddy Gajwel Meeting, Trs, Telangana, Kcr, Re-TeluguStop.com

గజ్వేల్ లో నిర్వహించబోతున్న ఈ సభ పై రేవంత్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు.  ఈ సభను సక్సెస్ చేయాలని రేవంత్ కసిగా ఉన్నారు.

అంతే స్థాయిలో ఈ సభను ఫెయిల్యూర్ చేసేందుకు టీఆర్ఎస్ వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టింది.  తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.

నేరుగా కిందిస్థాయి నాయకులకు ఈ సభ విషయంలో కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు.గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులను, డీలర్లను ఆర్ఎంపీల ను ఇలా అందర్నీ పిలిపించుకుని మరి ఈ సభ ఏ విధంగా ఫెయిల్యూర్ చేయాలనే విషయంపై చర్చిస్తున్నారు.

అలాగే సెప్టెంబర్ 17 వ తేదీన ప్రతి గ్రామంలోనూ కనీసం 500 మందికి భోజనాలు పెట్టే విధంగా టిఆర్ఎస్ మీటింగులు నిర్వహించాలని , కింది స్థాయి నాయకులకు ఆదేశాలు వెళ్లాయి.అలాగే తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఈ నియోజకవర్గంలో అదేరోజు పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు మొత్తంగా రేవంత్ సభ ను విఫలం చేసేందుకు టిఆర్ఎస్ ఎన్ని రకాల ఎత్తులు వేయాలో అన్నిటిని వేస్తూ , రేవంత్ సభను ఫెయిల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఈ వ్యవహారాన్ని తిప్పికొట్టేందుకు, టిఆర్ఎస్ కు చెక్ పెట్టే విధంగా సరికొత్త రూట్లో వెళ్తున్నారు .

Telugu Gajwel, Hujurabad, Hareesh Rao, Pcc, Revanth Reddy, Revanthreddy, Telanga

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బూత్ నుండి కనీసం ఏడుగురు ని అయినా సభకు తరలి వచ్చేలా చూడాలని పిలుపు ఇస్తున్నారు.గజ్వేల్ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా తరలిరావాలని రేవంత్ పిలుపు ఇస్తున్నారు.కనీసం లక్ష మందితో అయినా ఈ సభను నిర్వహించి  ఈ మీటింగ్ ను సక్సెస్ చేయడం ద్వారా, హుజురాబాద్ లో గట్టి పోటీ ఇవ్వాలనే వ్యూహంతో రేవంత్ ముందుకు వెళ్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube