చేరికల ప్లాన్ లో రేవంత్ సక్సెస్ ? వెనుకబడ్డ బీజేపీ ? 

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బీజేపీ బలంగా ఉన్నట్టు కనిపిస్తునే.ఆ పార్టీ నేతలు హడావుడి పెంచుతున్నారు.

 Rewanth Reddy Focused On The Issue Of Including Trs Leaders In The Congress , Re-TeluguStop.com

అంతే కాదు బీజేపీ అగ్రనేతలను తెలంగాణకు తీసుకొస్తూ టిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి తామేనని,  రాబోయే ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందనే సంకేతాలను ఇ స్తున్నారు.ఈ విషయంలో కాంగ్రెస్ కాస్త వెనకబడినట్టు కనిపిస్తున్నా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం సైలెంట్ గా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ గా టీఆర్ఎస్ అసంతృప్త నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు.గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పెద్దఎత్తున నాయకులు వచ్చి చేరుతున్నారు.
  టిఆర్ఎస్ లో సరైన ప్రాధాన్యం దక్కని వారు,  అసంతృప్తితో ఉన్నవారంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.వీరిని కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు.

ఇప్పటికే ఖైరతాబాద్ నియోజకవర్గం లో గట్టి పట్టు ఉన్న దివంగత పీజేఆర్ కుమార్తె, టిఆర్ఎస్ కార్పొరేటర్ విజయ రెడ్డి ని కాంగ్రెస్ లో చేర్చుకుని అందర్నీ  ఆశ్చర్యపరిచారు.ఇక ఆ తర్వాత వరుసగా చేరికలు మొదలయ్యాయి.

వైరా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తో పాటు మరికొంతమంది టిఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.వీరంతా టిఆర్ఎస్ లో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో ఉండగానే వారిని గుర్తించిన రేవంత్ కాంగ్రెస్ లో చేరాల్సిందిగా వారిని కోరడం,  సరైన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇవ్వడం తదితర కారణాలతో వీరంతా కాంగ్రెస్ లో చేరిపోయారు.
 

Telugu Bandi Sanjay, Revanth Reddy, Vijaya-Politics

ఇంకా అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు,  మాజీ మంత్రులు నియోజకవర్గస్థాయి నాయకులు టిఆర్ఎస్ లోనే ఉంటూ అసంతృప్తితో ఉండడంతో , అటువంటి నాయకులను ముందుగానే గుర్తించి వారితో చర్చించి కాంగ్రెస్ కండువా కప్పే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.పూర్తిగా చేరికల పైనే రేవంత్ దృష్టి పెట్టారు.ఈ విషయంలో బిజెపి బాగా వెనుకబడినట్టే కనిపిస్తోంది.చేరికలను పెద్దగా పట్టించుకోనట్లు గానే వ్యవహరిస్తున్నారు.  మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు బీజేపీలో చేరాలని ప్రయత్నించారు.కాని అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం తో బిజెపిలో చేరాలో వద్దా అనే ఊగిసలాట లో ఉండగానే రేవంత్ ఆయనతో మంతనాలు జరిపారు.

వెంటనే ఆయన కాంగ్రెస్ లో చేరిపోయారు.ఈ విధంగా టిఆర్ఎస్ అసంతృప్త నేతలు బీజేపీ వైపు చూస్తున్నా, వారిని చేర్చుకునే విషయంలో ఆ పార్టీ పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో దానిని రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటూ కాంగ్రెస్ ను చేరికలతో బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube