హుజురాబాద్ పై రేవంత్ పక్కా స్కెచ్...అసలు వ్యూహం ఇదేనా?

ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.అయితే కాంగ్రెస్ హుజురాబాద్ ఎన్నికల్లో పెద్దగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదనే వార్తలు బయటికొచ్చినా ఎప్పుడూ కాంగ్రెస్ నుండి ఎవరు స్పందించలేదు.

 Rewanth Pacca Sketch On Huzurabad  Is This The Real Strateg  Revanth Reddy, Huzu-TeluguStop.com

అయితే  రేవంత్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మొదట్లో హుజూరాబాద్ లో పోటీపై అంతగా ఆసక్తి కనబరచని  విషయం తెలిసిందే.  అయితే ఆ తరువాత కాంగ్రెస్ లోని అంతర్గత చర్చల తరువాత అభ్యర్థిని ప్రకటించడం, ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముమ్మరం చేయడం లాంటి విషయాలు మన కళ్ల ముందే జరుగుతున్న పరిస్థితి ఉంది.

అయితే  ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా చర్చ నడుస్తోంది.అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుపై ఫోకస్ చేయడంతో ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ లు మరింత జాగ్రత్త పడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది.

అయితే రేవంత్ ఎలాగూ హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు బీజేపీ కంటే మెరుగైన బలం ఉంది కాబట్టి చివరకు ఏదో ఒక పార్టీ గెలుపును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.అందుకే సాధ్యమైనంత వరకు ఒకవేళ ఓడిపోయినా పార్టీ బలాన్ని మాత్రం ఒకసారి మరల పెంచుకునే అవకాశం ఉంది.

Telugu @revanth_anumula, Huzurabad, Etala Rajendhar, Trs, Ts Poltics, Venkat Bal

అయితే బల్మూరి వెంకట్ ఇప్పడికే ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితుల్లో రేవంత్ తన వ్యూహం ప్రకారం కాంగ్రెస్ ఓటు శాతాన్ని పెంచుకొని అక్కడ రెండో స్థానం కాంగ్రెస్ దే అన్న రీతిలో పరోక్షంగా చెప్పనున్నట్లు తెలుస్తోంది.అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఉత్సాహంగా ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే రేవంత్ ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారు అనేది ప్రస్తుతానికి తెలియకున్నా వచ్చే ఫలితం తరువాత అందరికీ అవగతమయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube