కాంగ్రెస్‌లో రేవంత్ కొత్త రూల్‌.. అన‌వ‌స‌ర ప్ర‌యోగాల‌కు వెళ్తున్నాడా..?

మొన్న‌టి దాకా చ‌డీ చ‌ప్పుడు లేకుండ ఉన్న కాంగ్రెస్‌కు కొత్త బాస్‌గా రేవంత్ రెడ్డి రాక‌తో ఒక్క సారిగా ఊపు వ‌చ్చింది.కార్య‌క‌ర్త‌లు కూడా మ‌ల్లీ కాంగ్రెస్‌లో జోరు పెంచుతున్నారు.

 Rewanth New Rule In Congress Is He Going For Unnecessary Experiments-TeluguStop.com

దీంతో పాటే రేవంత్ యాక్ష‌న్ ప్లాన్ వేసి మ‌రీ పార్టీని ప‌రుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు.వ‌రుస నిర‌స‌న‌ల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

దీంతో చాలామంది నేత‌లు మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు.ఇక రేవంత్ కూడా చాలామంది కీల‌క నేత‌ల‌ను క‌లుస్తూ త‌న‌తో క‌లిసి రావాల‌ని కోర‌డంతో వారంతా ఇప్పుడు పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.

 Rewanth New Rule In Congress Is He Going For Unnecessary Experiments-కాంగ్రెస్‌లో రేవంత్ కొత్త రూల్‌.. అన‌వ‌స‌ర ప్ర‌యోగాల‌కు వెళ్తున్నాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో నిజామాబాద్ కు చెందిన కీల‌క నేత ధ‌ర్మపురి సంజ‌య్‌, అలాగే భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గండ్ర స‌త్యనారాయ‌ణ లాంటి వాళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.అయితే ఇప్ప‌టికే కాంగ్రెస్‌లో ఉన్న నేత‌లు వారి రాక‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక్క‌డే మ‌రీ ముఖ్యంగా ధ‌ర్మపురి సంజ‌య్ కాంగ్రెస్ కండుకు క‌ప్పుకోవ‌డాన్ని నిజ‌మాబాద్ స్థానిక నేత‌లు తీవ్రంగా వ్యతిరేకించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.దీంతో రేవంత్ అల‌ర్ట్ అయ్యారు.ఇక ముందు ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని ఒక క‌మిటీని వేయాల‌ని పీసీసీ నిర్ణయించింది.పార్టీలో చేరాల‌నుకునే వారి పూర్తి బ‌యోగ్ర‌ఫీని ఆ క‌మిటీ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఆహ్వానిస్తారంట‌.అంటే స్తాన‌కంగా వారికి వ్య‌తిరేకత లేకుంటేనే చేర్చుకుంటార‌న్న‌మాట‌.

Telugu Congress, Revanth-Telugu Political News

చేరాల‌నుకునే వారిపై క‌మిటీ గ‌న‌క స్క్రీనింగ్ చేసి అభ్యంత‌రాలు గ‌నక తెలిపితే ఆయ‌న్ను చేర్చుకోమ‌ని స్ప‌ష్టంగా చెబుతున్నారు.అయితే ఇక్క‌డే రేవంత్ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కు పోతున్న‌ట్టు తెలుస్తోంది.ఈ తాజా నిర్ణయంతో ఇప్ప‌టి దాకా కాంగ్రెస్ జెండా మోయాల‌నుకుంటున్న వారు ఎంట్రన్స్‌ టెస్ట్‌ తప్పనిసరి అవుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయే వారే ఉన్నారు గానీ పార్టీలోకి వ‌చ్చే వారు లేర‌ని, ఇప్పుడు ఏదో కంద‌రు వ‌స్తామ‌నుకుంటే అన‌వ‌స‌ర రూల్స్ పెడితే వారు కూడా రార‌ని చెబుతున్నారు కొంద‌రు.

#Revanth #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు