రానున్న రోజుల్లో మరింత దూకుడుగా రేవంత్.. అసలు కారణమిదే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే పీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా బాలపడేందుకు పెద్ద ఎత్తున వ్యూహాలు రచించిన పరిస్థితి ఉంది.

 Rewanth More Aggressive In The Coming Days .. Is The Real Reaso Telangana Congre-TeluguStop.com

ప్రస్తుతం చాలా వరకు కాంగ్రెస్ అంతగా శతా చాటకపోవడానికి ప్రధాన కారణం అంతర్గత పోరు అనేది సుస్పష్టం.అయితే రానునన్ రోజుల్లో కాంగ్రెస్ లో అంతర్గత పోరుకు ముగింపు పలకకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవకాశం లేదు.

అంతేకాక ప్రస్తుతం బీజేపీ నుండి రెండో ప్రత్యామ్నాయ స్థానం కొరకు తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ నేతలు కలసికట్టుగా బలంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటే తప్ప బీజేపీని వెనక్కి నెట్టే పరిస్థితి లేదు.

కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా కళ్లాల్లోకి కాంగ్రెస్ అనే నినాదంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు.

అయితే ఈ వ్యూహం కాంగ్రెస్ పార్టీ కి బలంగా కలిసొచ్చిన అంశం.ఎందుకంటే బీజేపీకి నల్గొండలో ఎదురైన అనుభవంతో బీజేపీ ఇక రైతుల వద్దకు వెళ్ళే ధైర్యం చేయలేదు.

దీంతో కాంగ్రెస్ రైతుల పక్షాన నిలబడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది.

Telugu Farmmers, Paddy, Revanth Reddy, Telangana, Trs-Political

ఇది కాంగ్రెస్ కు శుభ పరిణామం అని చెప్పవచ్చు.అయితే ఇప్పటి పరిస్థితులను బట్టి కెసీఆర్ బీజేపీ టార్గెట్ గా ముందుకెళ్తున్నారు కావున రానున్న రోజుల్లో రేవంత్ మరింత దూకుడుగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఒకప్పటితో పోలిస్తే కాంగ్రెస్ కొంత పుంజుకున్నా ఇంకాస్త పుంజుకోవాల్సిన అవసరం ఉందనేది మాత్రం సుస్పష్టం.మరి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి  భవిష్యత్ వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ ని ఎంత మేరకు బలపరిచేందుకు దోహదపడతాయన్నది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube