నిరుద్యోగ సైరన్ పేరుతో టీఆర్ఎస్ పై రేవంత్ మరో వార్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడడానికి ప్రయత్నిస్తోంది.అయితే తెలంగాణ ఏర్పడింది నీళ్ళు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన విషయం తెలిసిందే.

 Rewanth Is Another War On Trs Under The Name Of Unemployment Siren Telangana Po-TeluguStop.com

అయితే తెలంగాణ ఏర్పడ్డాక నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటి వరకు నిరుద్యోగులు ఆశించి నంతగా ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీకి ముందడుగు వేయలేదు.

ఇప్పుడు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ ల గురించి వేచి చూస్తున్న పరిస్థితి ఉంది.అయితే నిరుద్యోగులు కూడా ప్రభుత్వంపై ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు నిరుద్యోగుల ఆగ్రహాన్ని ఆధారంగా చేసుకొని అక్టోబర్ 2న నిరుద్యోగ సైరన్ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.దీంతో మరో సారి టీఆర్ఎస్ పై రేవంత్ మరో సారి ఘాటు విమర్శలు గుప్పించనున్నారు.

ఇక టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య మరో సారి వార్ జరగనుంది.అయితే సుమారు లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భారతీ చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది.

అయితే అంతే కాక ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సును పెంచడం ద్వారా  నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారనే విమర్శ అప్పట్లో బలంగా వినిపించిన సందర్బం ఉంది.అయితే ప్రభుత్వం తాజాగా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ లు భర్తీ చేస్తామని తెలిపినా ఇంకా నోటిఫికేషన్ ల విడుదలపై అధికారిక ప్రకటన రాలేదు.

మరి రేవంత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నిరుద్యోగ సైరన్ పై  టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube