రేవంత్ ఒంటరి పోరాటం.. ఇంద్రవెల్లి‌కి రాని ఆ జిల్లా నేతలు

ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా టీపీసీసీ చీఫ్ ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించారు.లక్షమందితో జరిగిన ఈ సభ సక్సెస్ అయిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 Rewanth Is A Lone Struggle Those District Leaders Who Do Not Come To Indravelli,-TeluguStop.com

అయితే, ఈ సభకు ఆ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరు కాకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సభ సక్సెస్ అయింది, ఇక కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ షురూ అయింది, టీఆర్ఎస్ పార్టీకి ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.

కానీ, సీనియర్ నేతలు ఈ సభకు గైర్హాజరు కావడం పట్ల పార్టీలో ఇంకా గ్రూపు రాజకీయాలు ఉన్నాయోమో అనే చర్చ నడస్తున్నది.ఇంతకీ ఆ సభకు హాజరు కానీ ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరంటే…

Telugu Comati Brothers, Congress, Revanth, Tg Congress, Tg, Tpcc-Telugu Politica

మొదటి నుంచి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పట్టున్ననేతలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు.అయితే, ఇటీవల కాలంలో ఈ జిల్లా నేతలకు రేవంత్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని వార్తాలు వచ్చాయి.ఈ క్రమంలోనే రేవంత్‌తో కలిసి పని చేస్తానని ఎంపీ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

దాంతో పార్టీల నేతల మధ్య ఐక్యత ఉందనే సంకేతాలు వెళ్లాయి.కానీ, ఏమైందో ఏమో తెలియదు.

‘దళిత, గిరిజన దండోరా’ సభకు కోమటిరెడ్డి బ్రదర్స్, టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆబ్సెంట్ అయ్యారు.నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు పలువురు కూడా ఈ సభకు హాజరు కాలేకపోయారు.

వారు ఎవరంటే.సగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హెచ్.

తనకు తీవ్ర జ్వరంగా ఉందని అందుకే సభకు హాజరు కాలేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు.ఇకపోతే వీహెచ్ కూడా హెల్త్ ఇష్యూస్ వల్లే సభకు హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏది ఏమైనా సీనియర్ల సహకారం తీసుకుని ముందుకు సాగితేనే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube