క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలోపేతంపై రేవంత్ దృష్టి...

పీసీసీ చీఫ్ గా  రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తరువాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్న విషయం తెలిసిందే.

 Rewanth Focuses On Strengthening Congress At Field Level   Revanth Reddy, Telang-TeluguStop.com

తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో రాజ్ భవన్ ముట్టడికి ఇచ్చిన పిలుపు ఎంతగా వివాస్పదమయిన విషయం తెలిసిందే.అయితే కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తేజితులను చేస్తూ ముందుకు సాగుతున్న రేవంత్ ఇక క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ను పటిష్ట పరచడానికి కార్యాచరణకు దిగనున్నట్లు  తెలుస్తోంది.

ఎందుకంటే క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేయడం ద్వారానే కాంగ్రెస్ పటిష్టపడుతుందనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ పై ఎక్కువ నమ్మకంపై పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పడు క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ను బలోపేతం చేయకపోతే ఏ ఎన్నికలో నైనా సత్తా చాటడం అన్నది సాధ్యం కాదన్నది  రేవంత్ ఆభిప్రాయం.అయితే రేవంత్ పాదయాత్రను నిర్వహించడానికి కూడా ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయి పటిష్టతకు ప్రణాళికలు రచిస్తున్నారు.

మరి రేవంత్ వ్యూహాలు సఫలమైతే కాంగ్రెస్ దశ మారటం ఖాయం అన్నట్లు తెలుస్తోంది.అయితే రేవంత్ ఇప్పటికే సీనియర్ లను కలుపుకొని పోతూ ముందుకెళ్తున్నపరిస్థితులలో వారి సేవలను ఎలా వినియోగించుకుంటారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube