కాంగ్రెస్ యువ నేతలపై రేవంత్ ఫోకస్...అసలు వ్యూహం ఇదే

ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జనాభాలో ఎక్కువ శాతం యువతరమే ఉన్న పరిస్థితి ఉంది.అందుకే అందరూ యువ తరాన్ని ఫోకస్ చేస్తూ వారి వారి కార్యాచరణను రూపొందించుకుంటున్న పరిస్థితి ఉంది.

 Rewanth Focus On Young Congress Leaders ... This Is The Real Strateg Telangana C-TeluguStop.com

ఎందుకంటే యువ ఆలోచనలు, వ్యూహాలు పార్టీలకు ఎంతో అవసరం.అందుకే ఎక్కువగా యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి ఉంది.

స్థానిక యువతను ఆకట్టుకోవాలంటే యువత అభిప్రాయాలు తెలిసిన వారే యువకుల సమస్యలపై నిలబడతారని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ విశ్వసిస్తోంది.అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా యువతపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

రేవంత్ కూడా సీనియర్ లపై కాకుండా యూత్ పై యువ నాయకులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ధీటుగా కౌంటర్ ఇవ్వాలంటే పార్టీలో యువతరాన్ని ప్రోత్సహించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.

అంతేకాక రానున్న రోజులు కాంగ్రెస్ కు పెద్ద ఎత్తున ఛాలెంజ్ గా మారే పరిస్థితులు ఉంటాయి.ప్రస్తుతం సీనియర్ లకు, రేవంత్ కు మధ్య పెద్ద ఎత్తున గ్యాప్ ఉన్న పరిస్థితి ఉంది.

Telugu Bjp, Congress, Revanth Reddy, Trs, Ts Congress, Ts Poltics, Young Congres

రేవంత్ వ్యూహాలను పకడ్భందీగా అమలుపరిచే అవకాశం లేదు.అంతేకాక యువ తరాన్ని ప్రోత్సహిస్తే అనుకున్న దాని కంటే తొందరగా పార్టీని బలపరచడం సాధ్యమవుతుంది.అయితే కాంగ్రెస్ ఇప్పుడు ఎంత మేర యాక్టివ్ గా ఉంటే బీజేపీని మూడో స్థానానికి పడేయడమే కాకుండా, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు దోహదపడుతుంది.ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ కూడా యువమోర్చా పేరుతో యువతరాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది.

  అయితే ఇప్పటికైతే అధికారికంగా యువ కమిటీలను ప్రకటించకపోయినా అంతర్గతంగా చర్చలు  కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.మరి రేవంత్ వేస్తున్న ఈ భారీ వ్యూహం కాంగ్రెస్ పార్టీ ను ఎంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube