టీఆర్ ఎస్ కీల‌క నేత‌పై రేవంత్ ఫోక‌స్‌... గులాబీ పార్టీకి దెబ్బ‌!

తెలంగాణ వ‌చ్చిన‌ప్ప టి నుంచి ఇప్ప‌టి దాకా టీఆర్ ఎస్ పార్టీకి అండ‌గా నిలిచింది మాత్రం ఇత‌ర పార్టీల్లోంచి వ‌చ్చిన వారే.కేసీఆర్ త‌న చాక‌చ‌క్యంతో ఎంతోమందిని త‌న పార్టీలోకి తీసుకుని ఆ త‌ర్వాత ప‌క్క‌న పెట్టేశారు.

 Rewanth Focus On Trs Key Leader  A Blow To The Rose Party!, Revanth, Trs, Y.s Ra-TeluguStop.com

దాంతో చాలామంది పార్టీని వీడారు.ఇంకొంద‌రు సైలెంట్‌గానే అదే పార్టీలో కొన‌సాగుతున్నారు.

ఇక ఇప్పుడు మ‌రో కీల‌క నేత పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు.ఆయ‌నే కేసీఆర్‌కు అత్యంత న‌మ్మ‌కస్తుడిగా మెలిగిన జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి.

శ్రీనివాస్ రెడ్డి వైఎస్ హ‌యాంలో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య అనుచ‌రుడిగా పేరు తెచ్చుకున్నారు.వైఎస్ కుటుంబంతో ఆయ‌న‌కు అత్యంత ద‌గ్గ‌రి సంబంధం ఉంది.ఇక కాంగ్రెస్ నుంచి హుజూర్‌న‌గ‌ర్ టికెట్ ఆశించినా చివ‌ర‌కు నిరాశ మిగ‌ల‌డంతో.టీఆర్ ఎస్‌లో చేరారు.

అంతే కాదు హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున కూడా పోటీచేసేందుకు ప్ర‌య‌త్నించారు.కానీ సైదిరెడ్డికి ఇవ్వ‌డంతో కేసీఆర్ ఆదేశాల మేర‌కు సైదిరెడ్డి గెలుపులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు శ్రీనివాస్‌రెడ్డి.

Telugu @ktrtrs, @revanth_anumula-Telugu Political News

ఇప్పుడు ఆయ‌న్ను కేసీఆర్ పెద్ద‌గా పట్టించుకోక‌పోవ‌డంతో ఏ ప‌ద‌వీ లేకుండా ఖాళీగానే ఉంటున్నారు.అయితే ఇప్పుడు రేవంత్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ కావడంతో ఆయ‌న‌న మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇక రేవంత్ కూడా ఆయ‌న‌తో గ‌తంలో స‌న్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలోకి రావాల‌ని కోరుత‌న్నారంట‌.

అదే జ‌రిగితే టీఆర్ ఎస్‌కు పెద్ద దెబ్బ ప‌డుతుంది. హుజూర్‌న‌గ‌ర్‌లో శ్రీన‌వాస్‌రెడ్డి పేరు చెబితే ఓట్లు రాలేంత పాజిటివ్ వేవ్ ఆయ‌న‌కు ఉంది.

అలాంటి వ్య‌క్తి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో ప‌ట్టుపెరుగుతుంది.మ‌రి ఆయ‌న్ను టీఆర్ ఎస్ వ‌దులుకుంటుందా లేక కాపాడుకుంటుందా అనేది చూడాలి.

మొత్తానికి రేవంత్ ఎఫెక్ట్ టీఆర్ ఎస్ మీద బాగానే ప‌డింద‌ని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube