పార్టీ వదిలిన నేతలపై రేవంత్ ఫోకస్... అసలు వ్యూహం ఇదే

తెలంగాణ కాంగ్రెస్ రోజు రోజుకు బలపడడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే రెండో ప్రత్యామ్నాయ పార్టీ స్థానం కోసం పెద్ద ఎత్తున రేవంత్ అధ్యక్షతన పోరాడుతున్న పరిస్థితి ఉంది.

 Rewanth Focus On The Leaders Who Left The Party This Is The Real Strategy Revant-TeluguStop.com

అయితే తెలంగాణ ఏర్పడకముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యంత బలమైన పార్టీలో ఒకటి.అయితే తెలంగాణ తరువాత కాంగ్రెస్ కీలక నేతలు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రజల్లో కాంగ్రెస్ అంటే కొంత వ్యతిరేకత ఏర్పడటం, ఉద్యమ ప్రభావంతో కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారిన పరిస్థితి ఉంది.

అయితే చాలా కాలం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో కాంగ్రెస్ ను నిలబెట్టలేక పోయారు.దీంతో ఆ తరువాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఘోర పరాజయాన్ని చూడవలిసి వచ్చింది.

అంతేకాక పార్టీలో ఐక్యత లేకపోవడం, గ్రూపు రాజకీయాలతో ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం కోల్పోయేలా వ్యవహరించిన పరిస్థితి ఉంది.అయితే ఇక ఆ తరువాత చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లాంటి పార్టీలో చేరి రాజకీయంగా తమ నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా చేసుకున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత  కోల్పోయిన కాంగ్రెస్ ప్రాశస్త్యాన్ని తిరిగి పొందేలా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం కుదిరేలా ప్రభుత్వ వైఫ్యల్యాలను ప్రజల్లో ఎండగడుతూ పోరాటాలు, నిరసనలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇందులో భాగంగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయిన కీలకనేతలను మరలా తిరిగి కాంగ్రెస్ లోకి రప్పించేలా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

మరి రేవంత్ పన్నుతున్న ఈ వ్యూహాలు కాంగ్రెస్ ను ఎంత వరకు బలపరచడానికి ఉపయోగపడతాయనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube