కొండావిశ్వేశ్వర్ రెడ్డితో జతగా రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది.పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారంటే రేవంత్ స్థాయి ఎంత గొప్పదో మనకు ఇట్టే అర్థమవుతోంది.

 Rewant Reddy's New Party With Kondavishweshwar Reddy, Mp Konda Vishveswar Reddy,-TeluguStop.com

అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది.కాంగ్రెస్ కు ఒక బ్రాండ్ గా మారిన అంతర్గత కలహాలు కాంగ్రెస్ ను నట్టేటా ముంచుతున్నాయి.

అందుకు దుబ్బాక, జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం.అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలో ఓటమి తరువాత పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం తరువాత జరిగిన హై డ్రామా మనకు తెలిసిందే.

తరువాత పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటస్తారని ఒక ప్రచారం, సీనియర్లు అడ్డుకున్నారని మరో ప్రచారం జోరుగా కొనసాగింది.

అయితే రేవంత్ ఒంటి చేత్తో పార్టీని నడిపిస్తున్న పరిస్థితులలో సీనియర్ లు ఎవరూ రేవంత్ కు మద్దతుగా నిలవకపోవడంతో ఒంటరిగానే కాంగ్రెస్ తరపున పోరాడుతూ వస్తున్నాడు.

అయితే షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్న తరుణంలో తొలుతగా షర్మిల ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలపై పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించింది.అయితే రెడ్డి సామాజిక వర్గం షర్మిల వైపు వెళితే రేవంత్ కాళ్ళ క్రిందికే నీరు వస్తుంది కదా అందుకే ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి రేవంత్ కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్తలలో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube