ఆ విష‌యంలో రేవంత్ స‌క్సెస్‌.. ఇక వరుస ఉద్య‌మాలే..

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అస‌లు కేసీఆర్ కు ఎదురుందా అనే ప్ర‌శ్న‌లు తలెత్తాయి.తెలంగాణ లో అస‌లు ప్ర‌తిప‌క్షాలు ఉన్నాయా అనే డౌటు కూడా క‌లిగింది.

 Revanth Success In That Regard And A Series Of Movements-TeluguStop.com

అంత‌లా ప్ర‌తిప‌క్షాల‌ను త‌న వ్యూహాల‌తో దారుణంగా దెబ్బ‌తీశారు సీఎం కేసీఆర్.అయితే రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం ప‌రిస్థితి మారిపోయింది.ఇప్పుడు కొత్త వ్యూహాల‌తో కొత్త నాయ‌కులు పుట్టుకొస్తున్నారు.ఇప్ప‌టికే బండి సంజ‌య్ రూపంలో ప్ర‌తిప‌క్షంగా బ‌ల‌ప‌డుతోంది బీజేపీ.ఇదిలా ఉండ‌గానే రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ అప్ప‌గించిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న టీఆర్ఎస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

ఇక ఇప్పుడు మ‌రో పోరాటానికి తెర‌లేపుతున్నారు.

 Revanth Success In That Regard And A Series Of Movements-ఆ విష‌యంలో రేవంత్ స‌క్సెస్‌.. ఇక వరుస ఉద్య‌మాలే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా రోజుల త‌ర్వాత త‌మ మిత్ర ప‌క్షాలైన ఇత‌ర పార్టీల‌తో రేవంత్‌రెడ్డి జ‌త క‌ట్టారు.రీసెంట్‌గానే వారితో గాంధీ భ‌వ‌న్‌లో మీటింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్‌లో అంద‌రం క‌లిసి ఉద్య‌మాలు చేస్తామంటూ పిలుపునిచ్చారు.

ఇక ఇప్పుడు అనుకున్న‌ట్టుగానే బీజేపీ మినహా మిగతా అన్నిపార్టీలు, అలాగే ప్రజా సంఘాలు క‌లిసి ఇందిరా పార్కు దగ్గర మహా ధర్నా చేయ‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది.ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న సీపీఎం, సీపీఐ, టీడీపీ, టీజేఎస్ సహా తెలంగాణ ఇంటి పార్టీలు ఇందులో పాల్గొన్నాయి.

Telugu Bandi Sanjay, Bjp, Cm Kcr, Congress, Cpi, Cpm, Revanth, Telongana All Partys, Tg News, Tjs, Trs, Ts Politics-Telugu Political News

దీంతో రేవంత్ బ‌లం మ‌రింత పెరిగింద‌ని నిపుణులు అంటున్నారు.ఒక్క‌డై అడిగేకంటే కూడా అన్ని పార్టీలు క‌లిసి ఒకే తాటిమీద‌కు వ‌చ్చి ఇలా నినదిస్తే ప్ర‌భుత్వం క‌చ్చితంగా దిగి వ‌స్తుంద‌ని చెబుతున్నారు.ఇక అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారును నిలదీసేలా వీరి ధర్నాలు ఉండ‌టంతో ఒకే స‌మ‌యంలో అటు టీఆర్ ఎస్‌కు, ఇటు బీజేపీకి చెక్ పెడుతున్న‌ట్టు చెబుతున్నారు.ఇది టీఆర్ ఎస్ కు పెద్ద స‌వాలుగా మారింది.

తెలంగాణ‌లో రాజకీయ ఉద్యమం మొదలైందని ఈ పార్టీలు అన్నీ చెప్ప‌డంతో కాంగ్రెస్లో మంచి జోష్ క‌నిపిస్తోంది.

#Revanth #Congress #Tg #Telongana #Bandi Sanjay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు